చలికాలం లో గొంతునొప్పికి బై బై …

 

Tonsillitis

చలికాలంలో జలుబు, తుమ్ములు, దగ్గు రావడం సహజంగా జరుగుతుంటాయి. ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా కనీసం మూడు, నాలుగు రోజులు వేధిస్తూనే ఉంటాయి. ఇక జలుబు ఉందంటే గొంతు నొప్పి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గొంతు సమస్య తగ్గించుకోవడానికి చిన్నపాటి ఇంటి చిట్కాలు ఫాలో అయితే సరిపోతుందంటున్నారు నిపుణులు.

ఉప్పు నీళ్లు…

గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో నోరును పుక్కలించాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అల్లం టీ …
అల్లంతో చేసిన టీ తాగడం, లేదా వేడి నీటిలో అల్లాన్ని వేసి ఆ నీటిని తాగడం వలన కూడా గొంతు నొప్పి తగ్గుతుంది.

 

Tonsillitis

నిమ్మరసం..

కొద్దిగా వేడి చేసిన నీటిలో నిమ్మరసం, తేనే కలుపుకొని తాగడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

మిరియాల పొడి ..

రోజు ఉదయం పాలల్లో మిరియాలు కలుపుకొని తాగడం వలన గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

చెక్క ..

దాల్చిన చెక్క, తేనే నీటిలో కలుపుకొని తాగిన మంచి ఫలితం ఉంటుంది.