చంద్రబాబు ఖర్చు పై హైకోర్టు విస్మయం..!

చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ధర్మపోరాట దీక్షతో ప్రజాధనాన్ని పెద్దఎత్తున దుర్వినియోగం చేశారని, ఇందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ కోర్టు ముందుంచేలా ఆదేశాలు జారీచేయాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేటుకూరి ఏవీఎస్‌ సూర్యనారాయణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కాగా ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 11న సీఎంగా ఉన్న చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఒక్కరోజు “ధర్మపోరాట దీక్ష” కు రూ.10 కోట్లు వ్యయం చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

దీనిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఇది కేవలం అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేపట్టిన దీక్ష అని, ఇందుకు ప్రజా ధనాన్ని వినియోగించడం సరి కాదని పేర్కొన్నారు.