బ్రేకింగ్: హిందూపురం లో బాలయ్యకు షాక్..?

ఎమ్మెల్యే గా హిందూపురం నియోజక వర్గం నుండి గెలిచినా తరువాత బాలయ్య అభివృద్ధి పనులను అటకెక్కించారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా వివాహ వేడుకకు హాజరవుతున్న బాలయ్యని లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు ఒక్కసారిగా బాలకృష్ణ కారు అడ్డుకోవడం తో షాక్ కి గురయ్యారు. బాలకృష్ణ హామీ ఇచ్చేవరకు ప్రజలు బాలక్రిష్ణని వదిలిపెట్టలేదు.

అలాగే, గతం లో భూమి పూజ చేసిన లేపాక్షి-హిందూపురం మెయిన్ రోడ్ ఇప్పటివరకు పూర్తీ కాలేదని గుర్తు చేసారు. హిందూపురం లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వస్తున్న బాలకృష్ణను గ్రామ ప్రజలు అడ్డుకొని రోడ్డు నిర్మాణం గురించి ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణం పూర్తవ్వకపోవడం వలన పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

నిర్మాణం కోసం చర్యలు మొదలు పెట్టి సంవత్సరం అవుతున్న పట్టించుకోకపోవడం తో ప్రజలే బాలయ్యని అడ్డుకున్నారు. దీని పై స్పందించిన బాలయ్య అధికారులతో మాట్లాడి పనులని పూర్తీ చేస్తానని హామీ ఇవ్వడం తో అక్కడి నుండి బయట పడ్డారు. ఆ తరువాత వివాహ వేడుకకి హాజరయ్యారు. మొత్తానికి గలిబిపల్లి గ్రామస్తులు బాలయ్యకు షాక్ ఇచ్చారు.