ఈ డైట్ తో బరువును ఆరోగ్యంగా తగ్గించుకోండి.

food,dietచిన్నప్పటి నుంచి లావు లేకపోయిన, బయట చిరు తిండ్లు తినడం వల్ల లావుగా అయిపోతాం. లావు ఎలా తగ్గాలి, ఎలా తగ్గుతే ఆరోగ్యంగా ఉంటాం, ఏం తినాలి, ఏ వ్యాయామాలు చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి..

ఉదయం ..
ఉదయం తీసుకోవాల్సినవి నిమ్మకాయ,తేన, మొలకెత్తిన గింజలు, కోడి గుడ్డు. పాటించ వలసిన పద్దతి…ప్రతిరోజు ఉదయాన్నే లేచి గోరు వెచ్చని నీటితో నిమ్మకాయ నీళ్లు, ఒక స్పూన్ తేన కలిపి తాగాలి. ఇలా తాగడం వల్ల నిమ్మకాయ తేన కొవ్వును తగ్గిస్తాయి. ఈ మిశ్రమం తాగిన తరువాత ఒక గంట పాటు నడవాలి, కుదిరితే 20నిమిషాలు అయిన పరిగెత్తాలి. తరువాత మొలకెత్తిన గింజలను, ఉడికిన ఒక కోడి గుడ్డును తినాలి.ఇంతటితో ఉదయం తినడం ఆపాలి.

మధ్యాహ్నం…
మధ్యాహ్నం బాగా తినాల్సిన సమయం … అలా అని పిజ్జా, బర్గర్ తినడం కాదు, అవి అన్ని పూర్తిగా మనేయ్యాలి. కేవలం ఒక మీల్స్ మాత్రమే తినాలి. అందులో రైస్ తక్కువ వుండాలి, కూరగాయలు ఎక్కువగా తినేలా చూసుకోవాలి. తరువాత 20 నిమిషాలు నడవాలి, నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజు 2 నుంచి 3 లిటర్ల నీళ్లు కచ్చితంగా తాగాలి.

సాయంత్రం…
ఏదైనా ఒక జ్యూస్ తాగాలి.. ఎక్కువగా పైన్ ఆపిల్, లెమన్, ద్రాక్ష , క్యారెట్, వంటి జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది కాబట్టి తొందరగా బరువు తగ్గటానికి సహాయ పడుతుంది.. అలాగే ఒక ఇరవై నిమిషాలు వ్యాయామం చెయ్యాలి.

రాత్రి…
రాత్రిపూట తిని పడుకోవడమే కాబట్టి తక్కువ తినాలి. ఉడికించిన కోడి గుడ్డు, ఉడికించిన కూరగాయలతో పాటు రెండు చపాతీలు తీసుకోవాలి. వీలైనంత తక్కువగా రాత్రిపుట ఆహారాన్ని తీసుకోవాలి. మీరు ఎంత ఆహారం తీసుకుంటే దానికి రెండింతలు నడవాలి అప్పుడే అది తొందరగా అరిగి లావు తగ్గుతారు..

పైన చెప్పినవి అన్ని కూడా వారి బరువుకు తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకోవాలి… ఇలా మూడు నుంచి నాలుగు నెలల పాటు తీసుకుంటే 8 కేజీల బరువు ఆరోగ్యకరంగా తగ్గుతారు.