ఇంట్లోనే చిటికలో రుచికరమైన చికెన్ ధమ్ బిర్యానీ… Hyderabad Chicken Biryani

Hyderabad Chicken Biryani

Hyderabad Chicken Biryani

Hyderabad Chicken Biryani
మనలో హైదెరాబాదీ చికెన్ ధమ్ బిర్యానీ అంటే తెలియని వారు ఉండరు ప్రపంచం మెచ్చిన హైదెరాబాదీ వంటకం. ఇది తినాలి అంటే హైదరాబాద్ లో వీధి కి ఒక హోటల్ లో బిర్యానీ దొరుకుతుంది కానీ మనం ఇంట్లోనే ఇది చేసుకుంటే భలేగా ఉంటుంది కదా ఐతే ఆలస్యం ఎందుకు చేద్దాం రండి.

కావలిసిన పదార్ధాలు.

చికెన్                        1 కిలో (స్కిన్ లెస్ చికెన్)
బాస్మతి                      బియ్యం ఒక కిలో
ఉల్లిగడ్డ                       200 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్            3 స్పూన్లు
లవంగాలు                    8
యాలకులు                  20
దాల్చిని చెక్క                ఒక స్పూన్
మరాఠి మొగ్గ                 3
కసూరి మేతి                 రెండు స్పూన్లు
జాజికాయ                   కొంచెం                                                                                               ధనియాల పొడి              50 గ్రాములు 
కొత్తిమీర                     రెండు కట్టలు
పచ్చి మిరపకాయలు       5
పుదీనా                      ఒక కట్ట
కారం                         సరిపడినంత
ఉప్పు                        సరిపడినంత
నెయ్యి                       4 స్పూన్లు
నూనె                        సరిపడినంత
పెరుగు                      250 గ్రాములు

తయారు చేసే విధానం.
ముందుగా వుల్లిగడ్డలని తరిగి ఎర్రగా కరకరలాడే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో చికెన్ వేసుకోవాలి తరువాత మసాలాదినుసులు , ఉప్పు, కారం, ఒక స్పూన్ నెయ్యి, పెరుగు, పచ్చి మిరపకాయలు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర మరియు పుదీనా వేసి వేయించుకొని పక్కన పెట్టిన ఉల్లిగడ్డలు సగం వేసి బాగా కలపాలి ఫ్రిడ్జ్ లో రాత్రంతా నాననియ్యాలి ఆలా కుదరకపోతే కనీసం 4 గంటలు నాననియ్యాలి లేదంటే చికెన్ మెత్తగా అవ్వదు .

Hyderabad Chicken Biryani
అర్ధ గంట ముందు బాస్మతి బియ్యాన్ని నీళ్ళల్లో కడిగి నానబెట్టుకోవాలి ఇలా చేస్తే బియ్యం పొడవుగా అందంగా తయారవుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనియ్యాలి నీళ్లు మరగకముందే బియ్యం వెయ్యకూడదు ఇప్పుడు నీళ్లు మరిగిన తరువాత ఒక బిరియాని ఆకు, మూడు టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం నూనె, రెండు యాలకులు మరియు రెండు లవంగాలు వేసి మరగనియ్యాలి తరువాత బియ్యాన్ని వేసి 60% వుడికిన తరువాత. మనం ముందుగానే నానబెట్టుకున్న చికెన్ పాత్రలో ఒక లేయర్ గా ఉడిగిన బియ్యాన్ని వెయ్యాలి ఆలా మొత్తం బియ్యాన్ని వేసిన తరువాత పైన కొత్తిమీర మరియు పుదీనా వేసి ముందుగా వేయించుకొని పక్కన పెట్టిన ఉల్లిగడ్డలు సగం వేసి కొన్ని బియ్యంమ్ మరిగిన నీళ్లు ఒకటి లేదా రెండు కప్పులు పోసి మిగిలిన నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి బయటకి పోకుండా తగినంత గోధుమ పిండిని ముద్దలా చేసుకుని పాత్రకి చుట్టూరా పెట్టాలి దీనివల్ల ఆవిరి బయటకు పోదు. ఇప్పుడు 10 నిముషాలు హై ఫ్లేమ్ 30 నిముషాలు సిమ్ లో ఉడికించుకోవాలి అంతే గుమగుమలాడే ధమ్ బిర్యానీ రెడీ

 

see also

http://www.teluguvilas.com/details-about-assam-boka-saul-rice/