అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో ప్రారంభం …

హైదరాబాద్ కె తలమానికమైన హైదరాబాద్‌ మెట్రో రైలు కారిడార్‌-1 (మియాపూర్‌-ఎల్‌బీనగర్‌) మార్గం సోమవారం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వెళ్లే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

metro , hyderabad metro , trendingandhra

metro , hyderabad metro , trendingandhrahyderabad metro , metro rail , metro 

గవర్నర్‌ సహా ప్రముఖులందరూ అమీర్‌పేట నుంచి మెట్రోలో ఎల్బీనగర్‌కు పయనమయ్యారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో ప్రయాణికులను అనుమతించనున్నారు. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్‌-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు ఎట్టకేలకు ప్రారంభం కావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెట్రోరైలు కారిడార్‌-1లోని కొంత దూరం మియాపూర్‌ నుంచి అమీర్‌పేట, కారిడార్‌-2లోని నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 30 కి.మీ. మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ గత ఏడాది నవంబరు 28న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచి ప్రయాణికులకు మెట్రోలో అనుమతించారు. ఈ సారి మాత్రం ప్రారంభోత్సవం రోజు సాయంత్రం నుంచే అనుమతిస్తున్నారు.