ఇదం జగత్ సినిమా రివ్యూ

 

idam jagath

సుమంత్ మల్లి రావా హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు . చాల రోజుల తర్వాత ఆ సినిమా మంచి హిట్ ఇచ్చింది . ఆ అవకాశాలు కూడా కూడా వచ్చాయి ఈ మద్యే ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’ అనే సినిమా విడుద‌లైంది. ఈ సినిమా కూడా పర్లేదు అనిపించింది, ఇప్పుడు ‘ఇదం జ‌గ‌త్’ సినిమాతో మరో సరి మన ముందుకు వచ్చాడు సుమంత్ ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది . త‌న సినిమాలు వ‌రుస‌గా వ‌స్తున్నా క‌థ‌ల‌లో వైవిధ్యం చూపించ‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈసారి థ్రిల్ల‌ర్ క‌థ‌ని ఎంచుకున్నాడు. ఈ సినిమా ఎలా , సుమంత్ అండ్ టీం ఎలా మెప్పించారో చూద్దాం .

నిశిత్ (సుమంత్‌) ఉద్యోగం లేక ఖాళీగా ఉంటాడు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌వు. చివ‌రికి ఫ్రీ లాన్స్ రిపోర్ట‌ర్‌గా త‌న‌కు తానే ఓ ప‌ని వెదుక్కుంటాడు. రాత్రి వేళ‌లో న‌గ‌రంలో జ‌రిగే ప్ర‌మాదాల్ని కెమెరాతో రికార్డ్ చేసి, ఛాన‌ళ్ల‌కు అమ్ముకుని జీవ‌నోపాధి పొందుతుంటాడు. ఆ క్ర‌మంలో మ‌హ‌తి (అంజుకురియ‌న్‌) ప‌రిచ‌యం అవుతుంది. తానెవ‌రో, ఏం చేస్తాడో అన్న విష‌యాల్ని మ‌హ‌తి ద‌గ్గ‌ర దాచి, ఆమెతో స్నేహం చేస్తుంటాడు నిశిత్. ఓసారి రోడ్డుపై జ‌రిగిన ఓ హత్య‌ని త‌న కెమెరాలో బంధిస్తాడు. ఆ ఫుటేజ్‌తో డ‌బ్బు సంపాదించాల‌నుకుంటాడు. అయితే ఆ ఫుటేజీనే త‌న జీవితాన్ని మ‌లుపు తిప్పుతుంది. మ‌హ‌తిని త‌న‌కు దూరం చేస్తుంది. ఇంత‌కీ ఆ ఫుటేజ్‌లో ఏముంది? దాని వ‌ల్ల ఎవ‌రి జీవితాలు ఏ ర‌కంగా మ‌లుపు తిరిగాయి? మరి సుమంత్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా ? ఆ హత్యా ను ఎవరుచేశారు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

నిషిత్ పాత్రలో నటించిన సుమంత్ ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. సవాలు తో కూడుకున్న పాత్ర కాకపోవడంతో పెద్దగా కష్టపడ్డట్లు అనిపించదు. హీరోయిన్ అంజు కురియన్ తన పాత్ర పరిధి మేర నటించింది. కాకపోతే గ్లామర్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సత్య అలాగే పోలీస్ ఆఫీసర్ గా నటించిన శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. నెగిటివ్ రోల్ లో నటించిన అర్జున్ రెడ్డి ఫేమ్ కళ్యాణ్ మంచి నటన కనబరిచాడు. తన ఆటిట్యూడ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

పాట‌లు, నేప‌థ్య సంగీతం రెండూ అంతంత మాత్ర‌మే. బ‌డ్జెట్ ప‌రిమితులు స్ప‌ష్టంగా క‌నిపించాయి. ద‌ర్శ‌కుడు అనుకున్న పాయింట్ బాగుంది. కానీ దాన్ని నిల‌బెట్టే స‌న్నివేశాలు, సంఘ‌ట‌న‌లు రాసుకోలేక‌పోయాడు. క‌థ‌, క‌థ‌నాలు రెండూ న‌త్త‌న‌డ‌క సాగాయి,సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి,దర్శకుడు అనిల్ ఇంట్రస్టింగ్ సబ్జెక్టు ను తెర మీదకు తీసుకురావడంలో కొన్నిచోట్ల తడబడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ అంటేనే ఆసక్తికర మలుపులు , ఉత్కంఠతో కూడిన స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తారు కాని ఈసినిమాలో అవి మిస్ అయ్యాయి. దాంతో సినిమా కొన్ని చోట్ల సాగదీసి నట్లుగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

సుమంత్
క‌థా నేప‌థ్యం
ఫస్ట్ హాఫ్ పర్లేదు

మైనస్ పాయింట్స్ :

కధనం
సెకెండ్ హాఫ్
ప్రొడక్షన్ వాల్యూస్ బాలేదు