పవన్ ఆలోచించి మాట్లాడకుంటే జనసేనకు నష్టమే

 

pawan kalyan,janasena

పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏపీలో రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్న పవన్ కళ్యాణ్ తన ఆవేశాన్ని కాస్తయినా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా మాట్లాడకుంటే దాని ప్రభావం జనసేన పార్టీ పైన పడే అవకాశముంది. ఇప్పటికి వివిధ జిల్లాల్లో బలమైన నాయకులు లేక అభ్యర్థులను ఎవరిని నిలబెట్టాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న జనసేన పార్టీ ఆ దిశగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ చేస్తున్న షాకింగ్ కామెంట్స్ జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ట్విట్టర్ ఎకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. ” నా వెనుక లక్షలాదిమంది జనసైనికులుమెదక్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున కుక్కలు నిలబెట్టిన గెలుస్తుందని అన్నారు .తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. నా వెనుక లక్షలాదిమంది జనసైనికులు ధవలేశ్వరం లో అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకెక్కించు కోను” అని చేసిన ట్వీట్ ఏపీ లో దుమారం రేపుతోంది. ఈ సమయంలో ఇది పవన్ కళ్యాణ్ చేయకూడని అనవసరమైన ట్వీట్ అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ టార్గెట్ చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఎన్నో అంశాల పైన, ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ టార్గెట్ చెయ్యొచ్చు. అది మానేసి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో జరిగిన చిన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడటం నందమూరి అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. అటు నందమూరి అభిమానులే కాదు ఆ సామాజిక వర్గ అసహనానికి కారణమవుతుంది. ఇక దీని ఇంపాక్ట్ ఏదోవిధంగా జనసేన పార్టీ పై పడే అవకాశముంది.
అందుకే ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచనతో మాట్లాడితే జనసేన పార్టీ సక్సెస్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదేవిధంగా ఆవేశం తో మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో జనసేన కు దెబ్బ తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సమయం సందర్భం లేకుండా అనవసరమైన అంశాలను ప్రస్తావించి ఎన్నికల కాలంలో విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని జనసేనాని కి సూచిస్తున్నారు. ఇప్పటికే నాగబాబు చేస్తున్న రగడ దుమారం రేపుతుంది. ఇక ఇప్పుడు పవన్ సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం నందమూరి అభిమానులకు, టిడిపి నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నా పవన్ తమతో పాటు కలిసి నడుస్తాడేమో అన్న ఆలోచనతో టీడీపీ నేతలు సంయమనం పాటిస్తున్నారు. అనవసర వ్యాఖ్యలతో పంచాయతీలు పెంచుకోవడం ఆపేసి పార్టీని పటిష్టం చేసి ఇలా చేసారు ఏంటి అని పార్టీ నేతలు పవన్ ను ప్రశ్నించకుండా చూసుకోవాల్సిన బాధ్యత జనసేన అధినేత గా నాపై ఉంది.