ఈ ఐదింటిని వదిలేస్తే.. అనుకున్న‌ది జ‌రిగి తీరుతుంది…!

అవును, ఈ ఐదింటిని వ‌దిలేస్తే మీ జీవితం మొత్తం సంతోషంగా మార‌డం క‌న్ఫామ్‌. అందులో మొద‌టిది అతి నిద్ర‌. అతి నిద్రలో ఉన్నంతసేపూ ప్ర‌తి ఒక్క‌రూ చ‌ల‌నం లేకుండా ఉంటుంటారు. ఆ కార‌ణంగా మ‌న జీవిత కాలంలో స‌గం స‌మ‌యం అతి నిద్ర కార‌ణంగా వృధా అవుతుంటుంది. 20 నుంచి 30 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌ వ‌య‌సు ఉన్న‌వారికి ఆరు గంట‌ల నిద్ర చాలు.

ప్ర‌పంచంలోని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన వారిలో ఎవ‌రిని ప‌రిశీలించినా వారు నిద్ర‌లేచే స‌మ‌యం ఉద‌యం నాలుగు నుంచి ఐదు గంట‌ల మ‌ధ్య‌లోనే ఉంటుంది. అలాగే అతిగా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరం బ‌ద్ద‌కిస్తుంది. మెద‌డు కూడా స‌రిగ్గా ప‌నిచేయ‌దు. జ్ఞాప‌క‌శ‌క్తి కూడా త‌గ్గుతుంది.

రెండ‌వ‌ది బ‌ద్ద‌కం. మ‌నిషి ఎంత‌వ‌రైనా దిగ‌జారిపోవ‌డానికి బ‌ద్ద‌కం ఉంటే చాలు. ఈ బ‌ద్ద‌కం మ‌నిషిని పాతాళానికి దిగ‌జార్చుతుంది. బ‌ద్ద‌కం ఉంటే స‌మ‌యం వృధా అవుతుంది. స‌యాన్ని వృధా చేస్తే చేయాల్సిన ప‌నిని స‌రైన స‌మ‌యంలో చేయ‌లేము. దాంతో ఒత్తిడి పెరుగుతుంది. ఇక ఈ ఒత్తిడి ఒక్క‌టి చాలు. స‌ర్వ‌రోగాల‌ను తెచ్చిపెడుతుంది. అందుకే ఈ బ‌ద్ద‌కాన్ని త‌క్ష‌ణ‌మే వ‌దిలేయడం మంచిది.

మూడ‌వ‌ది భ‌యం. నీ ధైర్య‌మే నీ మిత్రువు. నీ భ‌య‌మే నీ శ‌త్రువు. నీ ధైర్యమే నీ జ‌యము. నీ భ‌య‌మే నీ అప‌జ‌య‌ము. ఇటువంటి నిత్య స‌త్యాలు అంద‌రికీ తెలిసిన‌వే. ఇవి అక్ష‌ర స‌త్యం. భ‌యాన్ని వ‌దిలేసే నిరాశ‌వాదం వ‌దిలిపోతుంది. ధైర్యాన్ని తెచ్చుకుంటే ఆశావాదం వ‌స్తుంది. పాజిటివ్ థింకింగ్ ఉన్న వారిని విజ‌యం వ‌రించ‌క త‌ప్ప‌దు.

ఇక నాల్గొవ‌ది కోపం. తన కోప‌మే త‌న శ‌త్రువు అని పెద్ద‌లు అన్నారు. వ్య‌క్తికి ఎంత విజ్ఞాన‌మున్నా శాంతమ‌న్న‌ది లేకుంటే నాశ‌నానికి దారి తీస్తుంది. ఎంత క్రిటిక‌ల్ ప‌రిస్థితుల్లో ఉన్నా కోపాన్ని ద‌రిచేర‌నివ్వ కూడ‌దు. ఇది కొంచెం క‌ష్ట‌మైన‌దే అయినా విజ‌యం ద‌రిచేరాలంటే పాటించక త‌ప్ప‌దు.

మ‌నిషి అన్న వాడికి ఎప్పుడో ఒక‌ప్పుడు కోపం రాక త‌ప్ప‌దు. కానీ, మెల్ల‌మెల్ల‌గా, ప్ర‌శాంతంగా ఉండ‌టం అల‌వాటు చేసుకోవాలి. కోపంతో ఊగిపోయేవాళ్ల‌కు మెద‌డు స‌రైన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉండ‌దు. కోపంలో ఎన్నో నేరాలు చేసేవారు త‌ర‌చూ మ‌న‌కు క‌న‌ప‌డుతూనే ఉంటారు.

ఇక ఐద‌వ‌ది నిరాశ‌వాదం. ప‌చ్చ‌కామెర్ల వాడికి లోక‌మంతా ప‌చ్చ‌గా క‌నిపిస్తుందంటారు. అదే విధంగా నిరాశ‌వాదికి ఎక్క‌డికి వెళ్లిని అప‌జ‌య‌మే ఎదుర‌వుతుంది. అందుకే బీ పాజిటివ్‌.. బీ.స‌క్సెస్‌ఫుల్. ఇలా ఈ ఐదు గుణాల‌ను వ‌దిలేస్తే ఇక మీకు తిరుగే ఉండ‌దు. మీరు ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు.