కన్నడలో నైనా ఈ నందమూరి హీరో హిట్ కొడతాడా

is this nandamuri hero hit in kannada

కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన నటవారసులుగా హరిక్రిష్ణ , బాలక్రిష్ణ తెరంగేట్రం చేసారు. ఆ తరువాత నందమూరి వంశం నుంచి తారక రత్నని హీరోగా పరిచయం చేసారు. సినిమా చరిత్రలోనే ఈ హీరో కి లేనంత గ్రాండ్ గా నందమూరి తారక రత్న ని లాంచ్ చేసారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 సినిమాలను ఒకేసారి లాంచ్ చేసి రికార్డ్ సృష్టించాడు. చివరకి ఆ రికార్డ్ మాత్రమే మిగిలింది. మొదటి సినిమా కే రాఘవేంద్రరావు తో చినప్పటికీ నటన పెద్దగా ఆకట్టుపోకోలేకపోవడం వలన సినిమా ప్లాప్ అయ్యింది. లాంచ్ చేసిన సినిమాలు కూడా బాబు నటన చూసి ఆపేసారు. హీరోగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా విజయము సాధించలేదు. అమరావతి లో చేసిన విలన్ పాత్ర లో మాత్రం మెప్పించి అవార్డు దక్కించుకున్నాడు. తెలుగులో నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు కానీ ఫలించలేదు. ఎప్పుడు కన్నడ లో అదృష్టం పరీక్షించుకోనున్నాడు ఈ నందమూరి హీరో. కన్నడలో శివ ప్రభు దర్శకత్వం లో అమృతవర్షిణి అనే సినిమాలో నటిస్తున్నాడు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 10 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల కానుంది.