“టిక్‌టాక్‌కు” కొత్త వైరస్ సోకింది..!

ప్రపంచంలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన వీడియో యాప్స్‌లో ప్రధమ స్థానం టిక్‌టాక్‌ అని చెప్పచు. దీన్ని వినియోగిస్తున్న వినియోగదారుల్లో 40 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే అంట. అంటే అనేకమయిన ప్రభావాలకు లోనయ్యే అత్యధిక అవకాశం ఉన్న ప్రాయం వీరే. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలనే అత్యంత ప్రమాదరకరమైన వైరస్‌ ఒక్కటి టిక్‌టాక్‌కు సోకింది. అదే ఐసిస్‌ టెర్రరిస్టులు తమ బంధీలను పలు రకాలుగా హింసిస్తూ ఉన్న, గొంతులు కోసి చంపుతున్న వీడియో క్లిప్పులను ఇందులో పోస్ట్‌ చేస్తున్నారు.

గత మూడు వారాల నుంచే ఈ వైరస్‌ మొదలయింది. వీటిని చూసి ఉలిక్కిపడిన టిక్‌టాక్‌ కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు తొలగించేస్తున్నారు కూడా కానీ, గత వారం ఐసిస్‌ టెర్రరిస్టుల ప్రచార వీడియోలను యాప్‌ నుంచి యాజమాన్యం తొలగించే లోపలే అవి దాదాపు డజన్‌ ఖాతాలకు షేర్‌ అయిపోయాయి. అయితే ఐసిస్‌ వీడియో క్లిప్పింగ్స్‌లో ఎక్కువగా బందీల చేతులు వెనక్కి విరిచి కట్టేసి మొకాళ్లపై కూర్చోబెట్టి వారి మెడ నరాలను చాకుతో నరకడం, అతి దగ్గరి నుంచి బందీల తలలకు తుపాకులు ఎక్కుపెట్టి కాల్చివేసే దృశ్యాలే అధికంగా ఉన్నాయి.

175 నుంచి వెయ్యి మంది వరకు ఫాలోవర్లు ఉన్న ఓ ముగ్గురు యూజర్ల నుంచే ఇప్పటి వరకు ఈ వీడియోలు పోస్ట్‌ అయిన విషయాన్ని యాప్‌ యాజమాన్యం గుర్తించింది. వారిలో ఒక యూజర్‌ మహిళ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వారి పోస్టింగ్‌లకు 25 నుంచి 125 వరకు లైక్స్‌ కూడా రావడం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.

ఐసిస్‌ టెర్రరిస్టులు తమ ప్రచారం కోసం ప్రస్తుతం సోషల్‌ మీడియాలోని ఫేస్‌బుక్, ట్విట్టర్,యూట్యూబ్ ను బాగా ఉపయోగించు కుంటున్నాయి,ఇప్పుడు పాటలు, డ్యాన్సుల షేరింగ్‌లతో ఎక్కువ పాపులర్‌ అయిన ‘టిక్‌టాక్‌’లోకి కూడా వారు ప్రవేశించారు. టెర్రరిస్టుల పోస్టింగ్‌లను ఎవరు షేర్‌ చేయరాదని, ప్రోత్సహించరాదని యాజమాన్యం తాజాగా పిలుపు నిచ్చారు. టిక్‌టాక్‌ను బీజింగ్‌లోని బైటెండెన్స్‌ లిమిటెడ్‌ సంస్థ వారు నిర్వహిస్తున్నారు.