బిగ్ బ్రేకింగ్ : మ‌హేష్‌బాబు పార్ట‌నర్స్‌పై ఐటీ దాడులు..!

అవును, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు పార్ట్‌న‌ర్స్‌పై ఐటీ అధికారులు పంజా విసిరారు. కాగా, ఇటీవ‌ల కాలంలో దేశ వ్యాప్తంగా ఐటీ అధికారుల త‌నిఖీలు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల చెన్నై ఏకంలోని క‌ల్కీ భ‌గ‌వాన్ ఆశ్ర‌మంలో ఐటీ అధికారులు దాడులు చేయ‌గా, దాదాపు వెయ్యి కోట్ల‌కుపైగా న‌గ‌దును, ఇత‌ర బంగారు ఆభ‌ర‌ణాల‌ను సీజ్ చేశారు.

తాజాగా, ఏషియ‌న్ సినిమా కార్యాల‌యాల‌పై ఐటీ దాడులు సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపాయి. ఇప్ప‌టికే ఐటీ అధికారులు ఏషియ‌న్ అధినేత‌లైన నారాయ‌ణ‌దాస్‌, సునీల్ నారంగ్‌ల ఇళ్ల‌లో సోదాలు నిర్వ‌హిస్తున్నారు. అలాగే వారి స్నేహితుల ఇళ్ల‌ల్లోనూ ఐటీ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి.

కాగా, ఇటీవ‌లే ఏషియ‌న్ సినిమా సంస్థ వారు మ‌హేష్‌బాబుతో క‌లిసి ఏఎంబీ మాల్‌ను నిర్మించారు. అతి త్వ‌ర‌లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో క‌లిసి మ‌రో మ‌ల్టీ ప్లెక్స్‌ను నిర్మించేందుకు ఏషియ‌న్ సినిమా సంస్థ స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఈ త‌రుణంలో ఐటీ త‌నిఖీలు సినీ జ‌నాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుతం నాగచైత‌న్య – శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ఏషియ‌న్ సంస్థ ..
నైజాంలో భారీ చిత్రాల‌ను పంపిణీ చేయ‌డంతోపాటు ఏషియ‌న్ సినిమాస్ పేరిట ప‌లు థియేట‌ర్ల‌ను నిర్మిస్తోంది.