‘అన్న పిలుపు’ కార్యక్రమానికి ఉద్యోగులకు జగన్ లేఖలు…

jagan,anna pilupu

ఎన్నికలు అతి త్వరలో రానున్నాయి. దీంతో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 2014లో చేసిన తప్పులను మల్లీ చెయ్యకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులను ఆకర్షించేందుకు అన్న పిలుపు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, అందులో భాగంగా ఉద్యోగులకు లేఖలు రాశారు. ఆ లేఖలలో వైసీపీ పార్టీకి సూచనలు, సలహాలు ఇవ్వాలని రాసారు. ముందుగా సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ఉద్యోగులకు వైఎస్ జగన్ లేఖలు రాసారు.

ఈ నెల 15న ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. లేఖపై పార్టీ గుర్తు ఫ్యాన్‌, జగన్‌ ఫోటోను ముద్రించారు. ఫిర్యాదు ఇచ్చేందుకు ఆఖరున ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. విధి నిర్వహణలు మీరు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మిమ్మల్ని కలిసి ఏపీ ప్రగతికి మీ సలహాలు తీసుకోవాలని ఆశిస్తున్నానని జగన్ లేఖలో రాసారు. వైసీపీ పార్టీ వస్తే ఏపీ కళకళలాడుతుంది అని దీనికోసం ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు రావాలని ఆ లేఖలో రాసారు. మరి ఉద్యోగుల నుంచి ఎలాంటి జవాబు లభిస్తుందో చూడాలి.