జగన్ సర్కార్ పై జనసేనాని సంచలనం..!

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఇసుక ట్రాన్స్ పోర్టు లారీ ఓనర్లు, డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అలాగే, వైసీపీ ప్రభుత్వం వలన రాష్ట్ర ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని జనసేనాని ఆరోపించారు.

కాగా రాజకీయాల్లో ఎదగడానికి ఇలాంటి విమర్శలు చేయడం లేదని ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడటానికి నిరసనగా రోడ్ల మీదకు రావాల్సి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని ఇసుక కొరత వల్ల రాష్ట్ర ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, వీటిపైనే ఆధారపడి వారి జీవితాన్ని మలుచుకున్న ప్రజలందరూ కూడా చాలా బాధ పడుతున్నారని, కాగా ఆ బాధలను అందరికి తెలియజేయడానికి, తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

ఈమేరకు మాట్లాడిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలోని భావన నిర్మాణ కార్మికుల కోసం నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా లాంగ్ మార్చ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని, కానీ దీన్ని మరింతగా ఉదృతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు., అంతేకాకుండా ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యమే అని, భవన నిర్మాణ కార్మికులు, లారీ ఓనర్లు, క్లీనర్లకు న్యాయం జరిగే వరకు కూడా తమ పోరాటాన్ని ఆపమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.