సరిగ్గా ప్రచారం చెయ్యలేదు అందుకే ఓడిపోయాం అంటున్న పవన్ కళ్యాణ్

Janasena Pawankalyan Failure Reasons

Janasena Pawankalyan Failure Reasons

మొన్నటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో జనసేన పార్టీ దారుణ ఓటమి పాలైంది అయితే అలా ఓడిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చెబుతున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం , గాజువాక అసెంబ్లీ స్థానాల్లో సరిగ్గా ప్రచారం చేయలేకపోయాను అందుకే ఓటమి పాలయ్యాం అయినా ఓడిపోయాం కదా అని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాక జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తొలిసారిగా ఏపీ లో జరిగింది అయితే ఈ కమిటీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పోరాటాన్ని విరమించేది లేదని గెలుపు కోసం కృషి చేస్తాం అని ప్రకటించారు మరియు అలాగే రాజకీయ వ్యవహారాల కమిటీని పునర్వ్యవస్థీకరిస్తాం అని పేర్కొన్నారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ జనసేన అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు ఒకటి కాదు ఏకంగా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో కూడా దారుణంగా ఓడిపోయాడు దీంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రానున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి

Janasena Pawankalyan Failure Reasons