”కాస్టింగ్ కౌచ్” వివాదంలో ‘కైరా అద్వానీ’…

kaira advaniకైరా అద్వానీ ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరంలేదు. గత సంవత్సరంలో స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ కైరా ఆధ్వని. భరత్ అనే నేను సినిమా తరువాత , రామ్ చరణ్ సరసన నటించే బారి అవకాశం కొట్టేసింది ఈ భామ. ఈ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయిన కైరా అద్వానీ ప్రస్తుతం టాలీవుడ్ లో , బాలీవుడ్ లో బారి అవకాశాలతో దూసుకుపోతుంది. అయితే తాజాగా వినయ విధేయ రామ సినిమా విడుదల తరువాత ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు దీటుగా సమదాన్ని ఇచ్చింది కైరా…

ఆ ప్రశ్న ఏంటా అని ఆలోచిస్తున్నారా ? ఆదనండి గత సంవత్సరంలో కాస్టింగ్ కౌచ్ లు చేసిన వివాదం గురించి. ఈ విషయంపై కైరా మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే ఇంత వరకు అలాంటివి తనకు ఎదురుకాలేదు అని, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం అది, దానిమీద నా అభిప్రాయం ఎలా చెప్పగలను.. నాకు తెలిసి ఈ రంగంలో అలాంటివి ఉన్నాయని అనుకోను కానీ ఆ విషయానికి సంబంధించిన బాధితులు ఉన్నారు కాబట్టి అలాంటివి ఉన్నాయి ఏమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. నాకు తెలిసిన విషయాన్ని నిర్భయంగా అందరి ముందు బయటపెడుతాను, అలాగే నాకు తెలియని విషయాన్ని మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మాట్లాడిన విషయాలు కూడా ఎవరిని కించపరచాలని మాట్లాడలేదు అని’ వివడంలో పడకుండా చక్కగా తప్పిచుకుంది ఈ అందాల భామ…