కళ్యాణ్ రామ్ కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

kalyan ram,118

విభిన్నమైన స్టోరీలు ఎంచుకోవడంలో ముందు ఉండే హీరో కళ్యాణ్ రామ్ . ఈ మధ్య సరైన హిట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్న ఈ హీరో,తాజా గా మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘118’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. అయితే ఈ సినిమాను గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పక్కన నివేదా థామస్, షాలినీ పాండే లతో కలసి రొమాన్స్ చేయనున్నారు .ఈ మూవీ ని వచ్చే నెల మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత మహేశ్ కోనేరు ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయని సమాచారం. ఈ సినిమా ఆడియో వేడుకకి సంబంధించిన విషయాలను…..ట్రైలర్ లాంచ్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర బృందం తెలియజేయడం జరిగింది .ఈ సారి అయినా సూపర్ హిట్ కొట్టి కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ అవుతుందో, లేదో చూడాలి .