షాకింగ్ స్కెచ్ … కేసీఆర్ తో సీనియర్ల కుమ్మక్కు …కాంగ్రెస్ లో కేసీఆర్ చెప్పిన వాళ్లకు సీట్లు

KCR, Telugu Vilas

షాకింగ్ స్కెచ్ … కేసీఆర్ తో సీనియర్ల కుమ్మక్కు …కాంగ్రెస్ లో కేసీఆర్ చెప్పిన వాళ్లకు సీట్లు

కాంగ్రెస్ పార్టీ లో అభ్యర్థుల ప్రకటన ఊహించినట్టే గందరగోళంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థలు ఎంపిక తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులు చేసి జాబితా రూపొందించింది. జాబితాలో పేర్లు ప్రకటించాలని నిర్ణయించిన సమయంలో జాబితా వెలువడక ముందే పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. నిరసన మిన్ను ముడుతుంది. ఎక్కడ చూసినా జిల్లాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక తమకు టికెట్ రాదని భావిస్తున్న నాయకులు బహిరంగంగానే పార్టీ అధినాయకత్వం, తెలంగాణ నాయకులపై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు.


కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు కేసీఆర్ కు అమ్ముడుపోయారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. తాజాగా టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీఆర్ తో కుమ్మకయ్యారని ఆరోపించాడు. అందువల్ల కేసీఆర్ చెప్పిన డమ్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ తరపున టికెట్లు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇలా నలుగురైదుగురు సీనియర్లు కేసీఆర్‌కు అమ్ముడుపోయారని గజ్జెల కాంతం ఆరోపించారు.కేసీఆర్ చెప్పడంవల్లే తనతో పాటు అద్దంకి దయాకర్, శ్రావణ్ లకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయనున్న జాబితాలో దాదాపు 20 మందికిపైగా అభ్యర్థులు కేసీఆర్ చెప్పినవారే ఉంటారని గజ్జెల కాంతం తెలిపారు. కావాలనే దంమీలను నిలబెట్టి కేసీఆర్ కు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్న నాయకులు దాదాపు 20 స్థానాల్లో ఓటమి తధ్యం అంటున్నారు.

trs-Party,kcr
ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించి నిజాయితీతో పార్టీకోసం పనిచేసే నాయకులకు టికెట్లివ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలోని కోవర్టులుగా పనిచేస్తున్న వారి గురించి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళతామని చెప్తున్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు తాగాజా హాట్ టాపిక్ గా మారాయి.

Related Posts: — 

జగన్, గాలి జనార్ధన్ రెడ్డి ఆ ధైర్యం చెయ్యలేరు అన్న జేడీ లక్ష్మీ నారాయణ

నెట్టింట్లో ఇలియానాపై సెటైర్లు..!

కూటమిలో హాట్ టాపిక్… ఇబ్రహీం పట్నం సీటు ౩ కోట్లకు బేరం

రాములమ్మతో రేవంత్ భేటీ అందుకేనా ..!

హైదరాబాద్ పేరు మార్చాలని ఆ నేత డిమాండ్ చురకలంటించిన రేణుకా చౌదరి