ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్…!

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమ్మె మొదలైన తర్వాత మొదటిసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడిన కేసీఆర్, తిన్నది అరక్క చేస్తున్న పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా యూనియన్ ఎన్నికల్లో గెలుపు కోసమే, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ మూసివేతే…. సమ్మెకు ముగింపేమో అంటూ హెచ్చరించారు. 4ఏళ్లలో 67శాతం జీతాలు పెంచాక కూడా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని మండిపడ్డారు.

ఆర్టీసీని ఎవరూ కాపాడలేరన్న కేసీఆర్..ఇక సంస్థ మునిగిపోయినట్లేనని అన్నారు. ఆర్టీసీ విలీనం ఓ పిచ్చి డిమాండ్ అన్న కేసీఆర్‌, మరి ప్రైవేట్ ట్రావెల్స్‌కు, అద్దె బస్సులకు లాభాలు వస్తుంటే… ఆర్టీసీకి మాత్రం ఎందుకు నష్టాలు వస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఆర్టీసీ యూనియన్లవి అర్ధంపర్ధంలేని… అసంబద్ధమైన… దురంహకారపూరితమైన డిమాండ్లు అన్నారు కేసీఆర్.

యూనియన్లు లేకపోతే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్న కేసీఆర్‌…. ఐదారు రోజుల్లో 7వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు చెప్పింది కాబట్టి… కార్మికులతో చర్చలుంటాయని స్పష్టతనిచ్చిన కేసీఆర్‌…. ముఖ్యమంత్రినే తిడుతూ డిమాండ్లు సాధించుకోలగరా? అంటూ యూనియన్ లీడర్లపై ఫైరయ్యారు.