కూటమికి కోదండ రామ్ తో తలనొప్పులేనా ?

kodandaram,Telugu Vilas
 
మహాకూటమిలోని పార్టీలు అన్నీ సర్దుకుపోయే పార్టీలే ఒక్క టీజేఎస్ తప్ప.. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహా కూటమి అభ్యర్థుల ప్రకటన ఫైనల్ కు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఒకపక్క చంద్రబాబు సీట్లను సైతం టీజేఎస్ కోసం త్యాగం చేస్తున్నా సీట్ల సర్దుబాటు వ్యవహారంలో టీజేఎస్ ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. అడినన్ని సీట్లు రాబట్టుకునేందుకు కాంగ్రస్ కు మొదటి నుంచి అల్టిమేటం జారీ చేస్తున్న కోదండరాం మాట్లాడితే చాలు మేము ఒంటరిగా అయినా పోటీకి వెళ్తాం అని చెప్తున్నారు. మహా కూటమి పొత్తుల్లో భాగంగా టీజేఎస్ కు కనీసం 22 సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారట. కానీ తాజాగా 8మంది మాత్రమే ఇస్తానని కాంగ్రెస్ డిసైడ్ అవ్వడం కోదండ రామ్ లో ఆగ్రహం తెప్పించిందట.. అదే సమయంలో మరో రెండు సీట్లు తాము ఇస్తామని చంద్రబాబు చెప్పినా కోదండ రామ్ పార్టీ నాయకులు శాంతించటం లేదు. అడిగినన్ని కాంగ్రెస్ సమ్మతించకపోతే బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారట టీజేఎస్ నేతలు. ఒకపక్క బీజేపీ కూడా చాలా స్థానాల్లో అభ్యర్థులు లేక టీజేఎస్ తో పొత్తుకు సై అంటుంది.
kodandaram mahakutami,Telugu Vilas
టీడీపీ గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తానని ముందుగానే ప్రకటించింది. సీపీఐ కూడా కొంత అసంతృప్తిగా ఉన్న సర్దుబాటు ధోరణికి వెళ్లిపోయింది. ఇక మిగిలిన టీజేఎస్ మాత్రం చిన్న పార్టీ అయినా, సీట్ల విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఖరాఖండిగా చెబుతుంది. అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ ఆటోచనలో బీజేపీతో కలిసి వెళ్లక తప్పదని అంటున్నారు. బీజేపీ కూడా 25 సీట్లు ఆఫర్ చేస్తుండటంతో చాలా మంది టీజేఎస్ నేతలు కోదండరాం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి విచ్చిన్నం కోసమే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ టీజేఎస్ ను ఒంటరిగా బరిలోకి దిగాలని కూడా కొందరు నేతలకు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. కోదండ రామ్ తన పార్టీలోని నాయకులను కంట్రోల్ చెయ్యలేక వారు ఏమి చెప్తే అది కావాలని పట్టుబట్టటం కూడా కూటమికి తలనొప్పి తెప్పిస్తుంది. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొత్త పార్టీ అయినా సరే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపధ్యంలో అనివార్యత దృష్ట్యా కలిసి సాగాలని భావిస్తున్న ఇతర పక్షాలకు కోదండ రాం తీరు మింగుడు పడటం లేదు.