కొరటాలతో అర్జునరెడ్డి..?

Vijay Deverakonda, Telugu Vilas

కొరటాలతో అర్జునరెడ్డి..?

టాలీవుడ్ లో రైటర్ కమ్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ కొంత మందే స్టార్ డైరెక్టర్లు గా ఎదిగారు. దర్శకుడు కొరటాల శివ అలంటి వారిలో ఒకరు, భద్ర, సింహ లాంటి సినిమాలకు రచయతగా పని చేసిన ఆయన మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారి తర్వాత శ్రీమంతుడు, జనతా గారేజ్, భారత్ అనే నేను వంటి వంటి వరుస హిట్లు కొట్టి తన సత్తా చాటారు. ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా మంది ప్రొడ్యూసర్లు, అగ్ర హీరోలు ఈయన కోసం క్యూ కడుతున్నారు.

ఎన్టీఆర్ ‘బాక్సాఫీస్’ బాద్షా .. ఖైదీ నం 150 రికార్డు బ్రేక్ … రంగస్థలం పై కన్ను …

ప్రస్తుతం కొరటాల చిరంజీవి తో సినిమా చేసే పని లో ఉన్నారు, భారత్ అనే నేను సినిమా తర్వాత చాలా గ్యాప్ తీస్కొని చిరంజీవి కోసం స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తెలుస్తుంది, ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండతో సినిమా ఉండబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్ లో ఉన్నారు, ఈ సినిమా పూర్తైన తర్వాత కొరటాల సినిమా ఉంటుంది. ఇక తాజాగా నోటా లాంటి డిజాస్టర్ తో ఢీలా పడ్డ విజయ్ కొరటాల డైరెక్షన్ లో నటించబోతున్నాడన్న వార్త వినగానే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

ఫారెన్ భామతో రాంచరణ్, ఎన్టీఆర్.. 45 రోజులు ….

ఇటీవల ఒక ఫంక్షన్ లో కలిసిన వీళ్ళిద్దరూ సినిమా గురించి చర్చించుకున్నారట, దీంతో కొరటాల కూడా విజయ్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి వస్తాయి అంటున్నారు. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు, విజయ్ నటించిన టాక్సీవాలా చిత్రం ఎప్పటి నుండో వాయిదా పడుతూ ఈ నవంబర్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది.

నా జీవితంలో ఇదే పెద్ద అచీవ్ మెంట్

సరైనోడు సైకిల్ ఎక్కబోతున్నాడా …!