కర్నూల్ లో కాంగ్రెస్ కు షాక్: వైఎస్సార్ సీపీలో చేరిన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి

ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పార్టీల్లోకి చేరికలు మొదలయ్యాయి. ఇప్పటి వరుకు ఉన్న నేతలు అంత వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఉన్న పార్టీల నుంచి పక్క పార్టీలకు వెళ్తున్నారు. ఇకపోతే వైసీపీ పార్టీలో చేరికలు భారీగా ఉన్నాయి. తాజాగా ఇదే జరిగింది. 

కాంగ్రెస్ పార్టీకి కర్నూలు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. కోడుమూరు నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సుమారు 2వేల మందితో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో పాటు, ఏడుగురు ఎంపీటీసీలు, పలువురు సర్పంచ్‌లు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జగనన్నను ముఖ్యమంత్రి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు.