వైరల్ ట్వీట్: ఉపాసన రిక్వెస్ట్…. వెయిట్ చేయాలన్న కేటీఆర్!

Ktr, Upasana Tweet, Telugu Vilas

వైరల్ ట్వీట్స్: ఉపాసన రిక్వెస్ట్…. వెయిట్ చేయాలన్న కేటీఆర్!

రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం మాత్రమే కాదు… ఇటు సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె అంధ బాలికల వసతి విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశారు.

అంధ బాలికల హాస్టల్‌కు వార్డెన్‌గా పని చేస్తున్న శైలజా రాణి వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. స్కూల్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ సాంక్షన్ చేసింది. దీనిపై చాలా సంతోషంగా ఉన్నాం. హాస్టల్ కోసం కూడా మంచి భవనం సాంక్షన్ చేస్తే మరింత సంతోషిస్తాని శైలజా రాణి ఆ వీడియో ద్వారా కోరారు.

ఉపాసన ట్వీట్ చేస్తూ… ప్రియమైన తెలంగాణ ప్రభుత్వం. మీరు గొప్పగా పని చేస్తున్నారు. కానీ మీ నుంచి మరింత సహాయం అవసరం. ఈ బాలికల కోసం సహాయం చేయండి. నా వంతు సేవ నేను చేస్తున్నాను. దయచేసి వీరికి ఒక హాస్టల్ భవనం సాంక్షన్ చేయండి అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తున్న సింబల్‌తో కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

Image result for ktr

ఉపాసన రిక్వెస్ట్‌పై కేటీఆర్ స్పందిస్తూ…. స్కూలు భవనం మంజూరైనందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే హాస్టల్ భవనం కూడా సాంక్షన్ చేస్తాం. అయితే మీరు డిసెంబర్ 11న కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఆగాలి అని కోరారు.

upasana Ramcharan, Telugu Vilas

 

Related Posts: — 

కెమెరా ముందు శత్రువులు… వెనుక సోదరులు …..!

టాలీవుడ్ కి అందాల ‘నిధి’

పవన్ షాక్ అయి ఉంటారా..?

పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు టీడీపీ లో ఉన్నారా …!