రాయ్ లక్ష్మీ మసాలా మసాలా ….. ఎక్స్ పోసింగ్ ‘వేరీజ్ ద వెంకటలక్ష్మి’ రెడీ

lakshmi rai,telugu vilas

“సర్ధార్ గబ్బర్ సింగ్ ” “ఖైదీ 150 ” సినిమాలలో ఐటెం సాంగ్స్ తో అలరించిన హీరోయిన్ రాయ్ లక్ష్మీ. తాజాగా తను ప్రధాన పాత్రధారిగా ”వేరీజ్ ద వెంకటలక్ష్మి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాకి శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కమెడియన్స్ ప్రవీణ్ .. మధునందన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ లో చూస్తే రాయ్ లక్ష్మీ గ్లామర్ ను హైలైట్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. ఇప్పటికే బోల్డ్ కంటెంట్ తో తెలుగులో అనేక సినిమాలు వస్తున్న నేపథ్యంలో అలాంటి తరహా స్టోరీ తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్న రాయ్. యూత్ ను థియేటర్స్ కి రప్పించేలా ఈ టీజర్ లో కాస్త మసాలా గట్టి గానే దట్టించారు . గ్లామర్ విషయంలో రాయ్ లక్ష్మీకి వంకబెట్టవలసిన పనిలేదు. కానీ ఆమె గ్లామర్ ను మాత్రమే ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. మరి ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక ప్రవీణ్ .. మధునందన్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో దర్శమిస్తున్నారు . ఈ సినిమా సక్సెస్ వాళ్ల కెరియర్ ను కూడా ప్రభావితం చేసే అవకాశాలు వున్నాయి.