తనీష్ చేసిన పని ఇండియాలో ఏ హీరో కూడా చేయలేదు

 

tanishతనీష్ టాలీవుడ్ లో ఉన్న యువ హీరోల్లో ఎంతో టాలెంట్ ఉన్నవాడు అని చెప్పుకోవాలి. ఎంత ప్రతిభ ఉన్నా ఏంలాభం.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. దానికితోడు కొన్ని వివాదాలు, విషాదఘటనలు కూడా తనీష్ కెరీర్ ను దెబ్బతీశాయి. అయినాగానీ పట్టువదలకుండా కెరీర్ లో మళ్లీ పైకెదిగేందుకు కృషి చేస్తున్నాడు. ఇటీవల రంగు అనే వెరైటీ కథాచిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దానికి ముందు బిగ్గెస్ట్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసి ఫైనల్ రౌండ్ వరకు నువ్వానేనా అనేలా గట్టిపోటీ ఇచ్చాడు. సాధారణంగా తనీష్ ను చూడగానే మొదట కలిగే ఇంప్రెషన్… చాలా కోపిష్టి అనుకుంటారు. తనీష్ బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది. దూకుడెక్కువ… ఎప్పుడూ ఆవేశంగా ఉంటాడు. అతడితో కాసేపు మాట్లాడిన వాళ్లక ఇవే ఫీలింగ్స్ కలుగుతాయి. కానీ తనీష్ లో యాంగ్రీనెస్ మాత్రమే కాదు, గుండెలను పిండేసే మంచితనం కూడా ఉంది. అందుకే టాలీవుడ్ లో ఏ హీరో చేయని మంచిపనిచేశాడు. అసలు టాలీవుడ్డే కాదు… ఇండియాలో ఏ హీరో కూడా తనీష్ లా చేయలేదు అంటూ అతిశయోక్తి కాదు. ఇంతకీ తనీష్ ఏంచేశాడో తెలుసా..! కంటిచూపు లేని నాగమణి అనే అంధురాలికి సహాయకుడిగా ఆమె తరపున తాను పరీక్షలు రాశాడు. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత తన కొత్త అనుభవాన్ని తనీష్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నాగమణిలో ఉన్న ఒక మైనస్ ఆమెకు కంటిచూపు లేకపోవడం… కానీ ఆ లోపం కారణంగా చదువు ఆపకూడదన్న ఆమె పట్టుదల చాలా గొప్పది. ఆ సంకల్పమే నన్ను కదిలించింది… కానీ బ్రెయిలి లిపిలో ఆమె సబ్జెక్ట్ ను వంటబట్టించుకున్న తీరు అమోఘం… ఎగ్జామ్ హాల్లో ఆమె ఆన్సర్లు చెబుతుంటే నేను రాశాను… అప్పుడే అర్థమైంది నాగమణి ఎంతో కష్టపడి చదివింది అని…. పరీక్ష పూర్తయిన తర్వాత నాగమణి ముఖంలో చిరునవ్వు చూశాక నాలో ఏదో తెలియని ఆనందం, ఓ నిస్సహాయురాలికి సాయపడ్డానన్న తృప్తి కలిగాయి…. గాడ్ బ్లెస్ యూ తల్లీ..! ఈ సంఘటన తర్వాత నా అభిమానులకు, నా మేలు కోరే ప్రతి ఒక్కరికీ, నా వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే.. సాయం అనేది డబ్బు రూపంలోనే చేయాల్సిన పనిలేదు… చెయ్యాలి అనే ఆలోచన ఉండాలే కానీ, చెయ్యడానికి అనేక మంచిపనులు ఉన్నాయి… మీ మనసును సరైన స్థితిలో నిలిపితే చాలు… మిగతాది దానికదే జరిగిపోతుంది…. మీరు కూడా ఏదో ఒక రోజు నాలాగే తృప్తిగా ఫీలవుతారని ఆశిస్తున్నాను… అంటూ తనీష్ తన పోస్టులో పేర్కొన్నాడు. నిజంగా తనీష్ చేసింది ఏ హీరో చేయని మంచి పనే అని చెప్పుకోవాలి.