మాధవన్ హీరోగా తెలుగు సినిమా

 
 
madavan Telugu Movie Image,Telugu Vilas
సఖి, చెలి సినిమాలతో మాధవన్ కి తెలుగు లో మంచి క్రేజ్ ఏర్పడింది. మాధవన్ కి అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఆ కారణం గానే సవ్యసాచి లో ఆయన్ని విలన్ గా తీసుకున్నారు.మాధవన్ విలన్ గా చేయడం తో సినిమాకు కూడా మంచి బిజినెస్ జరిగింది. సవ్యసాచి సినిమా టాక్ సరిగ్గా లేనప్పటికీ మాధవన్ రోల్, ఆయన నటన బాగున్నాయి అని ప్రేక్షకుల నుండి ఆదరణ లభించింది.తెలుగు లో కూడా మాధవన్ కి మార్కెట్ ఉందని అర్ధమవటం తో మాధవన్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ విక్రమ్ వేద ను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
madavan,new movie,Telugu vilas
 
మాధవన్ , మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోలు గా నటించిన విక్రమ్ వేద ఆ సంవత్సరం లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమాని డి. సురేష్ బాబు రైట్స్ కొని తెలుగులో వెంకటేష్, రానా లతో నిర్మించాలని ప్రయత్నించారు. కానీ తమిళ్ ఒరిజినల్ ని నిర్మించిన వై నాట్ ప్రొడక్షన్స్ అమ్మలేదు. ఇపుడు విక్రమ్ వేద ని తెలుగులో వై నాట్ ప్రొడక్షన్స్ స్వయం గా రీమేక్ చేయనుందట. విక్రమ్ వేద చిత్రాన్ని పుష్కర్ , గాయత్రీ అని భార్య భర్తలు ఈ మూవీ ని డైరెక్ట్ చేసారు. తెలుగు లో దర్శకత్వ భాద్యతలను స్వామి రా రా ఫేమ్ సుధీర్ వర్మ కు అప్పగించనున్నారు వై నాట్ ప్రొడక్షన్స్. తమిళం లో లీడ్ పోలీస్ కారెక్టర్ చేసిన మాధవన్ ఇక్కడ కూడా అదే పాత్ర లో కనిపించనున్నాడు.మరో లీడ్ కారెక్టర్ లో నటించి విజయ్ సేతుపతే ఇక్కడ కూడా నటిస్తాడా లేదా తెలుగులో ఎవరినైనా తీసుకుంటారా అనేది చూడాలి. సుధీర్ వర్మ ప్రస్తుతం శర్వానంద్ తో సినిమా చేస్తున్నాడు. అది పూర్తి అయ్యినవెంటనే విక్రమ్ వేద తెలుగు పనులు మొదలు పెట్టనున్నాడట.