మహాకూటమి పార్టీ నేత అంత పని చేశాడా ? అందుకేనా ఈ లొల్లి

mahakutami images,Telugu Vilasమహా కూటమి తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించే ఉద్దేశం తో ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రత్యర్ధి పార్టీల కూటమి. అయితే కూటమి పార్టీల్లో సఖ్యత లేదు. పార్టీల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించకపోవటంతో తామే అభ్యర్థులమని చెప్పుకు తిరుగుతున్న వారు కూడా లేకపోలేదు. మహాకూటమి నుండి సీట్ల సర్దుబాటు ఆలస్యం కావటం తో కూటమిలోని ఆశావహులు టికెట్ తమకే కేటాయించారంటూ ఎక్కడికక్కడ ప్రచారం కూడా ప్రారంభించేశారు. దీంతో మహాకూటమి శ్రేణుల్లో ఆశావహుల మధ్య పార్టీల మధ్య చిచ్చు రగులుతుంది.
టీఆర్ఎస్ పార్టీ తమ ప్రచారాన్ని ఒక పక్కన సాగిస్తూనే మరో పక్క కూటమి పొత్తుల విచ్చిన్నం కోసం ప్రయత్నిస్తుంది. గులాబీ పార్టీ దేని కోసమైతే ఎదురు చూస్తుందో ఇప్పుడు కూటమిలో అదే జరుగుతుంది.పొత్తులు విచ్చిన్నం కాకుండా చంద్రబాబు అందరినీ ఒకతాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా సర్డుకుపోవాలని చెప్తున్నా ఎవరూ మాట వినే స్థితిలో లేరు. ముఖ్యంగా టీజేఎస్ కు కేటాయించే టికెట్ల విషయంలో జరుగుతున్న గందరగోళం కూటమి శ్రేణులకు తలనొప్పిగా తయారయ్యింది. తాజాగా కూటమిలో టీజేఎస్ నేత చేసిన కపిలవాయి నిర్వాకంతో కూటమికి కొత్త సమస్యలు మొదలయ్యాయి..

maha kutami,Telugu Vilas
తెలంగాణ జనసమితికి చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్మల్కాజ్ గిరిలో ఎన్నికలబరిలోకి కూటమి నుండి దిగినట్టు ప్రచారం చేస్తున్నారు. టీజేఎస్ నుండి తనకు కూటమి టికెట్ ఇచ్చిందని, మల్కాజ్ గిరి స్థానం నుండి పోటీలో ఉంటున్నానని ప్రకటన చేశారు. అంతే కాకుండా ప్రచారం కూడా ప్రారంభించి నియోజకవర్గంలోని ప్రజలను తనకు ఓటు వెయ్యాలని కూడా కోరుతున్నారు. గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి స్థానాన్ని మహాకూటమి తమ పార్టీకి కేటాయించిందని,కూటమిలోని ఉమ్మడి పార్టీలను సంప్రదించిన తర్వాతే ప్రకటిస్తున్నానని చెప్పిన దిలీప్ అధికారికంగా మరో రెండ్రోజుల్లో మహాకూటమి ప్రకటన చేస్తుందని చెప్పారు. దిలీప్ కుమార్ ప్రకటనతో కాంగ్రెస్ లో కుంపటి మొదలైంది.

maha kutami 2,Telugu Vilas
కాంగ్రెస్‌ తరపున టికెట్‌ ఆశిస్తూ ఎదురు చూస్తున్న ఏఐసీసీ ఓబీసీ జాతీయ కో-ఆర్టినేటర్‌ బోనగిరి సురేష్ యాదవ్‌ దిలీప్ కుమార్ ప్రకటనతో ఫైర్ అవుతున్నారు. టికెట్ కోసం అటు అధిష్ఠానం చుట్టూ ఇటు గాడ్‌పాదర్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆయన ఎప్పుడైతే దిలీప్ ప్రకటన చేశారో సురేష్ గాంధీభవన్‌ వద్ద తన మద్దతుదారులతో కలిసి ఆందోళనను దిగారు. 1958 నుంచి మల్కాజిగిరి సెగ్మెంట్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఉందని దానిని టీజేఎస్‌కు ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు గనుక టీజెఎస్‌కు వెళ్తే ఓడిపోవడంతో పాటు భవిష్యత్తులో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అధినాయకత్వానికి వివరించారు. టీఆర్ఎస్ కూటమిలో చిచ్చు రేగి ఎవరికి వారు విడిగా బరిలోకి దిగేలా కుట్రలు చేస్తున్న తరుణంలో కూటమి శ్రేణుల్లో సహనం లేకపోతే ఈ పొత్తు కష్టమే అనిపిస్తుంది. ఇది ఇంకా జాబితా ప్రకటించలేదు .. పరిస్థితి ఇలా వుంది.మరి జాబితా ప్రకటిస్తే పరిస్థితి ఇంకెలా వుంటుందో . మొత్తానికి టీజేఎస్ పార్టీ నేత పెట్టిన చిచ్చుతో కాంగ్రెస్ కు కొరివితో తల గోక్కున్నట్టు వుంది.

Also Read : కూటమికి కోదండ రామ్ తో తలనొప్పులేనా ?

                  ఏపి కి నీతూ అంబానీ వరాల జల్లు …!

                  సరైనోడు సైకిల్ ఎక్కబోతున్నాడా …!