మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నా మిథాలి కారణం కోచ్ అoట?

mithaliraj telugu vilas

ఇండియా టాప్ బ్యాట్స్ మాన్ ఒకప్పటి కెప్టెనమిథాలీ రాజ్‌్ ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో తనకు జరిగిన అవమానం తర్వాత సీనియర్‌ క్రికెటర్, వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్‌ తొలిసారి నోరువిప్పింది. కోచ్‌ రమేశ్‌ పొవార్‌, క్రికెట్‌ పాలకుల క మిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీపై తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు తనను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచకప్‌లో మిథాలీ వరుసగా రెండు అర్ధశతకాలు సాధించింది. ఫామ్‌లో ఉంది. సవాల్‌ విసురుతున్న పిచ్‌లపై నిలిచింది. ఆసీస్‌ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చిన జట్టు యాజమాన్యం కీలకమైన సెమీస్‌లో ఉద్వాసన పలికింది. ఈ పోరులో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ప్రపంచకప్‌ గెలిచే అవకాశాన్ని రెండు చేతులా జారవిడిచింది.
మిథాలీని ఎందుకు తీసుకోలేదని దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ‘అదో దుర్దినం. ఆసీస్‌పై గెలిచిన జట్టును తీసుకోవాలనే జట్టు యాజమాన్యం నిర్ణయించడంలో తప్పులేదు. తుదిజట్టును ఎవరూ ప్రశ్నించొద్దు’ అని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ మీడియాతో అన్నారు. దీంతో తనపై వేటు వేసేందుకు ఆమె (ఎడుల్జీ) తన అధికారాన్ని ప్రయోగించిందని మిథాలీ బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ, క్రికెట్‌ ఆపరేషన్స్‌ జీఎం సాబా కరీమ్‌కు రాసిన లేఖలో పేర్కొంది.
‘ఇరవై ఏళ్ల నా సుదీర్ఘ కెరీర్‌లో తొలిసారి కుంగిపోయా, ఆత్మవిశ్వాసం కోల్పోయా, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. అధికారంలో ఉండి నన్ను నాశనం చేయాలని, నా ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టాలనుకున్న కొందరు నా దేశానికి నేను చేసిన సేవలకు విలువనిస్తున్నారా అని ఆలోచించాల్సి వచ్చింది. టీ20 జట్టు సారథి హర్మన్‌ప్రీత్‌పై నాకెలాంటి వ్యతిరేకత లేదు. నన్ను జట్టు నుంచి తొలగించాలని చెప్పిన కోచ్‌ నిర్ణయానికి ఆమె మద్దతు ఇవ్వడమే ఎంతో బాధించింది. క్షోభకు గురిచేసింది’ అని మిథాలీ లేఖలో రాసింది.
‘నా దేశానికి ప్రపంచకప్‌ అందించాలని కోరుకున్నా. సువర్ణావకాశం చేజారినందుకు ఎంతో నిరాశ చెందా. బాధపడ్డా. డయానా ఎడుల్జీ పట్ల విశ్వాసంగా ఉన్నా. సీఓఏ సభ్యురాలిగా ఆమెను గౌరవించా. కరీబియన్‌ దీవుల్లోని నిజానిజాలు వివరించిన తర్వాతా ఆమె తన అధికారాన్ని ఇలా వ్యతిరేకంగా ఉపయోగిస్తుందని ఊహించలేదు. నన్ను రిజర్వు బెంచీపై కూర్చోబెట్టడాన్ని ఆమె మీడియాలో సమర్థించడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అన్ని నిజాలు తెలిసిన తర్వాతా ఇలా మాట్లాడటం వివక్ష చూపించడమే. కోచ్‌ రమేశ్‌ పొవార్‌ నన్ను అవమానించారు. ఇతరులు నెట్స్‌లో సాధన చేస్తుంటే చూసేవారు. నేను చూస్తుంటే పక్కకు వెళ్లిపోయేవారు. ఏదైనా మాట్లాడటానికి వద్దకు వెళ్తే సెల్‌ఫోన్‌ చూస్తూ నడుచుకుంటూ వెళ్లిపోయేవారు. ఇది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది. నన్ను అవమానించారు. అయినప్పటికీ నేను ప్రశాంతంగానే ఉన్నాను’ అని మిథాలీ లేఖలో వెల్లడించింది.

‘వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన క్షణం కోచ్‌ సమస్య మొదలైంది. నాతో వ్యవహరించే శైలి, వివక్షకు సంబంధించిన గుర్తులు కనిపించాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని గ్రహించా. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సమస్య పరిష్కారం కోసం జట్టు మేనేజర్‌ను కలిసి విషయం చెప్పా. ఈ వ్యవహారం తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఆ తర్వాత పొవార్ నన్ను గుర్తించడమే మానేశాడు. అతడి దృష్టిలో జట్టులో నా ఉనికి లేనేలేదు. అతడిని పలకరిద్దామన్న చూపులు పక్కకు తిప్పుకొనే వాడు. జట్టు మేనేజర్‌తో నా సమావేశం ఆయన అహం దెబ్బతిన్నట్టుంది. ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు సాయంత్రం జట్టు సమావేశం ముగిసిన తర్వాత పవార్‌ నా గదికి వచ్చారు. బయట మీడియా ఉండటంతో అక్కడికి రావొద్దని ఆదేశించారు. నేను జట్టులో ఉంటే మీడియా ఏం చేస్తుందో అర్థంకాలేదు. చాలా పెద్ద మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు నా సొంత జట్టుతో నన్ను కలవొద్దని చెప్పాడు. అప్పుడు నేను హతాశురాలినయ్యా. నా 20 ఏళ్ల జీవితాన్ని జట్టుకు అంకింతం చేశా. నా కృషికి విలువ లేదా అని ఆలోచిస్తూ కన్నీరు ఆపుకోలేకపోయా ’ అని మిథాలీ ఆవేదన చెందింది.

 

For Latest Gallery Visit 

Nehasharma Spicy Pics