మొబైల్ అప్స్ రంగం పై చైనా దండయాత్ర …

కొన్ని ఏళ్ళ క్రిందటి మాట మొబైల్ ఫోన్స్ విక్రయాలు పుంజుకుంటున్న దశలో నోకియా ఫోన్లదే అగ్రస్థానం కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. మొబైల్ ఫోన్ రంగాన్ని శాసించటానికి కొన్ని చైనా కంపెనీలు భారత్లో అడుగుపెట్టాయి చైనా దెబ్బకు బహుళజాతి కంపెనీలు అన్ని తోకముడవక తప్పలేదు. LG ఫోన్ల అయితే చూద్దాం అన్న ఇండియా లో కనపడవు. అతి తక్కువ ధరలకే అన్ని ఫీచర్స్ తో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. తరువాత భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలవల్ల చైనా ఫోన్ విక్రయాలు కొంచం తగ్గాయని చెప్పవచ్చు. ఈ దశలో Samsung భరత్ లో నెంబర్ వన్ గా అవతరించింది.

ఇక అసలువిషయానికి వస్తే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు మొబైల్ ఆపరేటింగ్ సిస్టం రంగంలో దీనిదే అగ్రస్థానం మొబైల్ అప్స్ తయారీదారుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. పేస్ బుక్ , ట్విట్టర్, వాట్సాప్ చాలావరకు ఆండ్రాయిడ్ మీదే ఆధారపడి ఉన్నాయ్ ఇప్పటివరకు ఇవ్వే శాసిస్తున్నాయి. అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చైనా అప్స్ తయారీ రంగం బాగా పుంజుకుంది . భరత్ లో వీటి వినియోగం బాగా పెరిగింది అని చెప్పవచ్చు. 50% వీటి వాటా ఉన్నదంటే చైనా అప్స్ భరత్ పై ఉన్న ప్రభావం ఎంత ఉందొ అర్ధం చేసుకోవచ్చు. tiktok , PUBG , shareit , helo , ఇంకా ఇలా చుప్పుకుంటే చాల వున్నాయి.

భరత్ చైనా అప్స్ మీదే ఆధారపడుతుందా లేదా మన అప్స్ మనమే తయారు చేసే స్థాయికి వెళ్తామా చూడాలి….