మురగదాస్ సినిమాని లైన్ లో పెట్టిన సూపర్ స్టార్

 

murugadossమురగదాస్ సినిమా అంటే పక్కా మాస్ కమర్సియల్ హంగులతో , కొంచెం మెసేజ్ జోడించి తన మాస్ టేకింగ్ తో థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తాడు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన స్పైడర్ మాత్రం మిస్ ఫైర్ అయింది. ఆ వెంటనే తమిళ మాస్ హీరో విజయ్ తో సర్కార్ తీసి కోట్ల వర్షం కురిపించాడు. తమిళ్ ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసింది ఈ సర్కార్. దాంతో సూపర్ స్టార్ సినిమాని లైన్ లో పెట్టేసాడు మురగదాస్. అందుకు సూపర్ స్టార్ కూడా ఓకే చెప్పేసాడు. రోబో 2.o తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ రజినీకాంత్. రోబో ఇంకా ఆడుతుండగానే పెట్ట టీజర్ తో చేసిన హంగామా అంతా… ఇంతా..కాదు. రోబో ఆలా వెళుతుందో… లేదో… వెంటనే సంక్రాంతి బరి లో దిగిపోతున్నాడు రజిని. ఇదిలా ఉంటె పెట్ట రిలీజ్ కాకముందే మురగదాస్ తో సినిమా ని లైన్ లో పెట్టేసి పట్టాలెక్కించబోతున్నాడు. సంక్రాంతి తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. ఇది రాజకీయా నేపథ్యంలో ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. కానీ మురగదాస్ మాత్రం ఇది పక్కా మాస్ మాసాల కమర్సియల్ ఎంటర్టైనర్ అని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇలా వరుస సినిమాలతో జోరు పెంచి కుర్ర హీరోలకు ఉపిరి ఆడకుండా చేస్తున్నాడు రజినీకాంత్.