గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా అక్కినేని నాగార్జున

వైసీపీ అధినేత జగన్ ని ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో నాగార్జున భేటీ కావడంపై రాజకీయంగా చర్చలకు దారితీస్తోంది.  నాగార్జున గుంటూరు ఎంపీగా బరిలోకి దిగుతున్నారనే గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్నిక‌ల వేళ‌..అందునా గుంటూరు జిల్లా వైసిపి నేత‌లు జ‌గ‌న్ వ‌ద్ద ఉన్న స‌మ‌యం లో నాగార్జున హాజ‌రు కావ‌టం చ‌ర్చ నీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నాగ్ కు గుంటూరు ఎంపీ టికెట్ కన్ఫామ్ అయిందని.. బలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఇదే అంశంపై గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. అమరావతిలో మీడియాతో ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు జయదేవ్ స్పందిస్తూ  ‘ ఈ విషయం గురించి నాకు తెలియదు. నేను వైసీపీలో లేను… హైదరాబాద్ లో లేను. కాబట్టి దాని గురించి కామెంట్ చేయలేను’ చమత్కరించారు. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. నాగ్ నాపై పోటీ చేస్తారంటే నమ్మనని గల్లా జయదేవ్ పేర్కొనడం గమనార్హం.