బాలయ్య ఇచ్చిన షాక్ లో సూపర్ స్టార్ కృష్ణ

 

balakrishna,biopicఎన్టీఆర్ బయోపిక్ ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచునాలు ఉన్నాయి. క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. నందమూరి బాలయ్య గారు ఎన్టీఆర్ గా కనిపిస్తారు రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ రోజు సాయంత్రం ఆడియో వేడుకతో పాటు ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ కూతుళ్లతో పాటు కృష్ణ, కృష్ఱం రాజు, మోహన్ బాబు, నటీమణులు గీతాంజలీ, జమున తదితరులు హాజరు కానున్నారట. జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌ని కూడా బాలయ్య ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే ఆడియో లాంచింగ్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు కృష్ణ ఇంటికి వెళ్ళిన బాలయ్య కొద్ది సేపు సూపర్ స్టార్‌, ఆయన తనయుడు నరేష్‌తో సరదాగా ముచ్చటించి ఆ తర్వాత తన పాత్రకి సంబంధించిన ఫోటోలని మొబైల్‌లో చూపించారట. బాలయ్య గెటప్ చూసి కృష్ణ ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే మైల్ స్టోన్ అవుతుందని సీనియర్ నరేష్ తన ట్వీట్‌లో తెలిపారు. చిత్రంలో ఎందరో తారలు ముఖ్య పాత్రలలో కనిపించనుండగా, సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీరవాణి చేసిన పాటలు కూడా ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎలా అందుకుంటుందో చూడాలి .