ఎన్టీఆర్ నిజమైన కథ రెండో భాగం లో తెలుస్తుంది …నారా బ్రహ్మాణి ఆసక్తికర వ్యాఖ్యలు ..!

 

ntr biopic,nara brahmaniనందమూరి నటసింహం ప్రధాన పాత్రలలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ . ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి పార్ట్ ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9 న విడుదల చేసారు . ఈ సినిమా విడుదలైన ప్రతిచోటా కూడా మంచి సూపర్ హిట్ మౌత్ టాక్ తో దూసుకుపోతుంది.ఇక చిత్రాన్ని నందమూరి కుటుంబ సభ్యుల కోసం ఎఎంబి సినిమాస్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. బాలయ్యతో పాటు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఈ షోకు హాజరయ్యారు.

సినిమా చూసిన అనంతరం నారా బ్రహ్మాణి ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది . తెరపై నాన్నగారిని చూసినపుడు అచ్చం తాతగారిలా కనిపించారు. మనవరాలిగా తాతగారితో నేను చాలా తక్కువ సమయం గడిపాను. సినిమా చూస్తే అందరికీ తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ ప్రజా సేవ గురించి ఆలోచించేవారు. ఫ్యామిలీతో చాలా తక్కువ సమయం గడిపారని నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. తాతగారి జీవితంలోని చాలా విషయాలు ఈ సినిమాలో చూడటం జరిగింది. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి పాలిటిక్స్‌లో ఎంటరయ్యే వరకు తాతగారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. సినిమా చూసిన తర్వాత నాకు ఆయన మనవరాలి గా  చాలా గర్వంగా అనిపించిందని బ్రాహ్మణి చెప్పింది.ఎన్టీఆర్ నిజమైన కథ రెండో భాగం లో తెలుస్తుంది అని నారా బ్రహ్మాణి  అన్నారు .