సీఎం జగన్‌ పై నారా లోకేశ్ ఫైర్..!

ఈ సారి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయినా కూడా వైసీపీ, టీడీపీ మద్గ్య రోజూ మాటల యుద్ధం పెరిగిపోతూ ఉంది. కాగా గత కొద్ది రోజుల నుంచి టీడీపీ యువనేత నారాలోకేశ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు.

తాజాగా జగన్ పాలనపై స్పందించిన లోకేశ్ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా జగన్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోమల నివారణకు అంత ఖర్చా అని ఏడ్చారు. ఇప్పుడు మీ తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారు.

రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు చనిపోతున్నా మీలో చలనం లేదని, మండపేటలో శ్రీ నవ్య డెంగ్యూ తో చనిపోయారు. ఆ బాధతో ఆమె భర్త చందు, కూతురు యోషిత ఆత్మహత్యకి పాల్పడిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసిందని, ఈ దున్నపోతు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని నారా లోకేశ్ మండిపడ్డారు.