జగన్మోహన్ రెడ్డి కాదు… జగన్ మోదీ రెడ్డి : నారా లోకేష్ …!

Nara Lokesh, Telugu Vilas

జగన్మోహన్ రెడ్డి కాదు… జగన్ మోదీ రెడ్డి : నారా లోకేష్ …!

ఈ రోజు జరిగిన ధర్మ పోరాట దీక్ష సభలో జగన్ పై ఫైర్ అయ్యారు నారా లోకేష్ .
విశాఖ విమానాశ్రయంలో నవ్వుకుంటూ వెళ్లిన జగన్… హైదరాబాదు ఎయిర్ పోర్టులో నవ్వుకుంటూ, చేతులు ఊపుతూ వెళ్లారని లోకేష్ చెప్పారు. మూడు గంటల సేపు బాగానే ఉన్న జగన్… ఆసుపత్రిలో దుప్పటి కప్పుకుని, ఫొటోలు బయటకు పంపి, డ్రామాకు తెరతీశారని అన్నారు. ఏపీ పోలీసులతో మాట్లాడనని, తెలంగాణ అధికారులకైతే సమాధానాలు చెబుతానని హాస్యాస్పదంగా వ్యవహరించారని చెప్పారు. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదని జగన్ మోదీ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

Image result for nara lokesh

జగన్ కు కోర్టుకు వెళ్లడానికి, ఇంటికి వెళ్లడానికి, పాదయాత్రకు సమయం ఉంటుందని.. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హత్య చేస్తే… వారి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మాత్రం సమయం ఉండదని లోకేష్ విమర్శించారు.

Related Posts: — 

ఏపి కి నీతూ అంబానీ వరాల జల్లు …!

కూటమికి కోదండ రామ్ తో తలనొప్పులేనా ?

తెలంగాణలో మహాకూటమి సీట్ల పంపకం… కాంగ్రెస్‌కు 91, టీడీపీకి 15, టీజేఎస్‌కు 8, సీపీఐకి 5 సీట్లు..!