శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న PM నరేంద్ర మోడీ…

 

Narendra Modi Visited Tirumala

తిరుమల: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అనగా నిన్న రాత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు మరియు ఆయన వెంట గవర్నర్ నరసింహన్ అలాగే ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు
శ్రీవారి దర్శనానంతరం మోడీ శ్రీలంక రాజధాని కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు
అనంతరం అక్కడి నుంచి తిరుమలలోని పద్మావతి అతిధి గృహానికి చేరుకున్నారు అక్కడ టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రధాని మోడీకి అలాగే గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు
అనంతరం అతిధి గృహంలో కాసేపు విశ్రాంతి తర్వాత మోడీ,జగన్,నరసింహన్ నేరుగా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా అర్చకులు అధికారులు స్వాగతం పలికారు మొదటిగా ధ్వజస్థంభానికి మొక్కుకొని బంగారు వాకిలి నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం వీరు వకుళామాతను, విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు
తరువాత ప్రధాని మోడీ శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించారు రంగనాయకుల మండపంలో వేదపండితులు ముగ్గురికి వేదం ఆశీర్వచనం చేశారు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తీర్థ ప్రసాదాలను అందజేశారు
అనంతరం మోడీ , వైస్ జగన్ ఆలయం వెలుపలికి రాగానే భక్తులు పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు ప్రధాని, సీఎం వారికి అభివాదం చేస్తూ తిరిగి పద్మావతి అతిథిగృహానికి పయనమయ్యారు
అనంతరం కాసేపు విశ్రాంతి తర్వాత తిరుగుప్రయాణం కోసం విమానాశ్రయానికి బయలుదేరారు

Narendra Modi Visited Tirumala