జాతీయ పార్టీ లకు సోషల్ మీడియా ప్రచారం…. కోట్లల్లో డిమాండ్ అడ్డంగా దొరికి పోయిన నటులు

రానున్న లోక్‌సభ ఎన్నికలకు మందే భారీ ఎత్తున ముడుపులు ముట్టచెప్పేందుకు అన్ని రాజకీయ పార్టీ తెగ ఉబలాట పడుతున్నాయి.సాధారణంగా ఏ ఫిల్మ్ సెలెబ్రెటీ అయినా యార్డ్స్,సినిమా,వాణిజ్య ప్రకటనల ద్వారా డబ్బు సంపాదిస్తారు.కానీ ట్రెండ్ మారింది.ఇపుడు ఏకంగా ట్వీట్స్ కి ,పోస్ట్స్ కి కూడా భారీ పారితోషికాలు అందుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తుంది.ఈ సెలెబ్రెటీస్ చేయాలిసింది కూడా అదే..వివరాల్లోకి వెళితే సోషల్ మీడియా వేదికగా వారికీ నచ్చిన పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు గానూ కొందరు సినీ ప్రముఖుల డబ్బు తీసుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. పార్టీలకు అనుకూలంగా పోస్టులు పెట్టేందుకు ఒప్పుకుని 36 మంది బాలీవుడ్ ప్రముఖులు కెమెరాకు అడ్డంగా బుక్ అయ్యారు. వీరిలో ప్రముఖ హీరో జాకీ ష్రాఫ్, సోనూసూద్, వివేక్ ఒబెరాయ్, కైలాశ్ ఖేర్ ఉన్నారు.

ఈ విషయాలన్నీ ఎలా బయటికి వచ్చాయనుకుంటున్నారా…తాజాగా ‘కోబ్రాపోస్ట్’ అనే ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో వీరు దొరికిపోయారు. కోబ్రాపోస్ట్ విలేఖరులు ప్రజాసంబంధాల ప్రతినిధులమని చెప్పుకుంటూ.. సినీ, టీవీ నటులు, గాయకులు తదితరులను వారి మేనేజర్ల ద్వారా సంప్రదించారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాము సూచించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలని. దీనికి 36 మంది ప్రముఖులు అంగీకరించారు.రానున్న రోజుల్లో ఆ పార్టీ కి సంబంధించి ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు అంటే ‘‘అత్యాచారం,స్కామ్స్ , వంతెనలు కూలడం” వంటి వివాదాస్పద అంశాల్లో వీరు ప్రభుత్వాన్ని సమర్థించడానికి అంగీకరించారు. ఇంకా వీరు ఇలాంటి ఇంకెన్నో ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు.. కోబ్రాపోస్ట్‌ ముఖ్య సంపాదకుడు అనిరుద్ధ బహల్‌ చెప్పారు. ఒక్కో పోస్ట్‌కు 3 లక్షల నుంచి 60 లక్షల వరకూ డిమాండ్ చేశారని తెలిపారు. హోల్ సేల్ గా 9 నెలల కాంట్రాక్ట్ కోసం 20 కోట్లు అడిగిన వారు కూడా ఉన్నారట. అంతే కాకుండా ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు వారిలో… విద్యాబాలన్, సౌమ్య టాండన్, అర్షద్ వార్సి, రజా మురాద్ ఈ విషయానికి దూరంగా ఉన్నట్టు సమాచారం.

అయితే డీల్ ఒప్పుకున్న ప్రముఖుల వివరాలు పరిశీలిస్తే … డబ్బు తీసుకొని ట్వీట్లు చేయడానికి అంగీకరించినవారిలో అమీషా పటేల్‌, సన్నీ లియోన్‌, శ్రేయస్‌ తల్పడే, రాఖీ సావంత్‌, శక్తి కపూర్‌, పంకజ్‌ ధీర్‌, ఆయన కుమారుడు నికితిన్‌ ధీర్‌, కోయినా మిత్రా, పునీత్‌ ఇస్సార్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, మిన్నిసా లాంబ, టిస్కా చోప్రా, మహిమా చౌధురి, రాహుల్‌ భట్‌, రోహిత్‌ రాయ్‌, అమన్‌ వర్మ, గాయకులు దలేర్‌ మెహందీ, మికా, అభిజిత్‌ భట్టాచార్య, బాబా సెహ్‌గల్‌, నృత్య దర్శకుడు గణేశ్‌ ఆచార్య, హాస్య నటులు రాజ్‌పాల్‌ యాదవ్‌, రాజు శ్రీవాస్తవ, కృష్ణ అభిషేక్‌, విజయ్‌ ఈశ్వర్‌లాల్‌ పవార్‌ తదితరులు ఉన్నారు. అయితే ఈ విషయమై స్పందించిన సోనూసూద్.. వీడియోలోని తన మాటల్లో మార్పులు చేశారని, కొన్ని అంశాలనే ఉపయోగించుకుంటూ చెడుగా తనను చూపించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.