కౌశల్ ఆర్మీ ఫేక్ ఆర్మీ అంటూ వాదించిన బాబు గోగినేని పై నీలిమ ఫైర్

neelima-fires-on-babugogineni-argued-on-kaushal-army-is-pake-armyబిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో చాలా వివాదాలు అయినా విషయం అందరికి తెలిసిందే , ముక్యంగా కౌశల్ మిగతా ఇంటి సభ్యుల మధ్య వార్ జరిగేది . ఏది ఏమైనా కౌశల్ ఆర్మీ వలన కౌశల్ విజయం సాధించాడు .షో జరుగుతున్నన్ని రోజులు సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కౌశల్‌కు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా వారిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీల్లో ట్రోల్ చేయడం లాంటివి అప్పట్లో సంచలనం అయ్యాయి. చివరకు షో హోస్ట్ నాని కూడా కౌశల్ ఆర్మీ సెగ ఎదుర్కొన్నారు. మరో వైపు బాబు గోగినేని కౌశల్ ఆర్మీ ఫేక్ ఆర్మీ అంటూ తన వాదన వినిపిస్తూనే ఉన్నారు.

కౌశల్ బిగ్ హౌస్ షోలోకి రాకముందే ఆర్మీ ని క్రియేట్ చేసుకొన్నాడు అని ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్ ప్రకారం దీన్ని నడిపించారనేది బాబుగోగినేని ఆరోపణ. అది పేయిడ్ ఆర్మీ ఆనే సంచలన కామెంట్స్ సైతం బాబు గోగినేని చేశారు, ఈ విషయం పై మెల్‌బోర్న్‌లో డిబేట్ జరిగింది.కౌశల్, ఆయన భార్య నీలిమతో పాటు బాబు గోగినేని, కిరిటీ దామరాజు పాల్గొన్నారు.

కౌశల్ ఆర్మీని అతడి కుటుంబ సభ్యులే డబ్బులిచ్చి రన్ చేశారనే బాబు గోగినేని ఆరోపణలపై కౌశల్ భార్య నీలిమ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి అంటూ భగ్గుమన్నారు.ఈ రోజు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వేల కౌశల్ ఆర్మీ, కౌశల్ మండ పేజీలు ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కౌశల్ క్రియేట్ చేశారా? ఏదో ఫేస్‌బుక్ పేజీ పట్టుకుని కౌశల్ క్రియేట్ చేశారని ఎలా అంటారు? అంటూ నీలిమ ఫైర్ అయ్యారు.

బాబుగారికి ఫేస్‌బుక్ ఆపరేట్ చేయడం చాలా కష్టం అనుకుంటా. అందులో ఎనీటైమ్ పేరు మార్చుకోవచ్చు. ఎవరు ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా పేరు మార్చుకోవచ్చు. ఆ విషయం స్కూలు పిల్లలకు కూడా తెలుసు. ఆయనకు తెలియదేమో… అని కౌశల్ చెప్పుకొచ్చారు..

Image result for kaushal manda

మే 30వ తేదీ వరకు కౌశల్ గారు ఈ గేమ్ లోకి వస్తున్నట్లు ఆయనకే తెలియదు. అలాగే వేరే వారికి కూడా తెలిసే అవకాశం లేనట్లే… అని బాబు గోగినేని మాట్లాడుతుండగా నీలిమ కల్పించుకుని, మాకు ఇవన్నీ వద్దండీ మే నెలలో ఆర్మీ స్టార్ట్ అయింది అన్నారు. ప్రూఫ్ చూపండి అంటూ నిలదీశారు.

కౌశల్‌కు ఆర్మీ ఫాం అవుతుందని ఆవిడకు ఎలా తెలుస్తుందండీ? హౌస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ నిమ్మకాయ పిండితే ఆర్మీ ఫాం కావాలని ఆవిడ ఏమైనా చెబుతుందా? మీరరన్నట్లు కౌశల్ ఆర్మీ ఫాం అయిందనే అనుకున్నాం. లోపలికి వెళ్లిన తర్వాత నేను కిరిటీకి డబ్బులిచ్చి నువ్వు నా కళ్లలో నిమ్మకాయ పిండు అని చెప్పానా? అని కౌశల్ అన్నారు ,

బిగ్‌బాస్ ఇంట్లో మీరంతా నన్ను ఒంటరిని చేసి ఆడుకున్నారు కాబట్టి కౌశల్ ఆర్మీ ఫాం అయింది… అని కౌశల్ మరోసారి డిబేట్లో నొక్కి వక్కానించారు. కౌశల్ ఆర్మీ మీరే క్రియేట్ చేశారనడానికి నా వద్ద చాలా ప్రూఫ్స్ ఉన్నాయంటూ బాబు గోగినేని… ఫేస్‌బుక్ పేజీలో అకౌంట్స్ క్రియేట్ అయిన తేదీలను చూపించారు.

ఇలా పలు వాదనలతో డిబేట్ ముగిసింది ,డిబేట్లో మెల్‌బోర్న్‌లోని తెలుగు వారు పాల్గొన్నారు. దీని పై కౌశల్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి