మూడురోజుల్లోనే సూపర్ రికార్డును సాధించిన ఎన్టీఆర్…!

Ntr, Telugu Vilas

Ntr Aravinda Sametha Collects 100 Cros Grass In 3Days: — ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్యంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మరో రికార్డును క్రియేట్ చేసింది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లను(గ్రాస్‌) కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ నెల 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇటు అభిమానుల, అటు చిత్ర పరిశ్రమ వర్గాల ఈ చిత్రంపై ప్రశంసలు వర్షం కురిపించారు.

NTR's Aravinda Sametha , Telugu Vilas

Also Read: — అరుదైన రికార్డు సాధించిన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్!

తొలివారాంతంలోనే ‘అరవింద సమేత..’ చిత్రం రూ.100కోట్లు(గ్రాస్‌) వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రాన్ని ఆదరించి ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా, సునీల్‌, జగపతిబాబు నవీన్ చంద్ర, నాగబాబు కీలక పాత్రలలో నటించారు.

Aravinda Sametha Veera Raghava , Telugu Vilas

Also Read: — చిరంజీవి ‘ఠాగూర్’ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన పరుచూరి గోపాలకృష్ణ …!