మొదటి పాటకు ముహూర్తం

 

ntr,biopic,tollywoodఎన్టీఆర్ బయోపిక్ ఎక్కడ ఉన్న ఎక్కడ విన్న ఎన్టీఆర్ బయోపిక్ ఈ సినిమా గురించి మాటలు ఆ మాటలు క్రిష్ వరకు వినపడుతున్నాయి ఏమో అoదుకే ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఈ రోజు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఒక్క లుక్ రిలీజ్ చేశారు. అoదులో మరి పెద్దాయనకు ఏం కోపం వచ్చిందో ఏమో వెనక చాలామంది నిలబడి జేజేలు కొడుతున్నారు.    క్రిష్ అండ్ టీమ్ ఈ సినిమానుండి ‘కథానాయక’ అంటూ సాగే మొదటి సాంగ్ ను రేపు(డిసెంబర్ 2వ తారీఖు) ఉదయం 7.42 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో బాలయ్య అచ్చతెలుగుదనం ఉట్టిపడే తెలుపు రంగు లాల్చీ ధోతీ కట్టుకుని నాన్నగారి గెటప్ లో అసెంబ్లీ ముందు విసవిసా నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మరి ‘కథానాయకా’ పాటతో అయన ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.