‘రానాకీ 30 లక్షల’ కమిషన్ ముట్ట సెప్పిన…’యంగ్ టైగర్ ఎన్టీఆర్’

యాడ్ బిజినెస్ మామ,యాడ్ బిజినెస్ నీకెంత …నాకెంత…లెక్క బరా-బరి ఉండాలి మళ్ళా..ఈలెక్కలోకి వస్తున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోస్.ఈ ఒప్పదం గురించి తెలిస్తే షాక్ అవుతారు.వివరాల్లోకి వెళితే.. హీరో రానాకీ 30 లక్షల కమీషన్ ఇస్తున్నాడు… యంగ్ టైగర్ ఎన్టీఆర్ . రానా కు ఎన్టీఆర్ కమీషన్ ఇవ్వడం ఏంటి… ? అని అనుకుంటున్నారా.. ? తాజాగా ఎన్టీఆర్ ఆప్పీ ఫిజ్ యాడ్ కి ఒప్పుకున్న విషయం తెలిసిందే . ఆ యాడ్ కోసం ఎన్టీఆర్ ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు …! దాంతో 30 లక్షలు రానా కు కమీషన్ కింద ఇస్తున్నాడు .

ఎందుకంటే ఆ యాడ్ వచ్చింది రానా వల్లే కదా అందుకు , రానా మంచి బిజినెస్ మెన్ అన్న విషయం తెలిసిందే .తండ్రి సురేష్ బాబులాగే హీరో రానా కూడా మాంచి …. బిజినెస్ ఐడియాలు వున్న వ్యక్తి. సినిమాల్లోకి హీరోగా రాకముందు నుంచే వ్యాపారాల్లో ఆయన అడుగు పెట్టారు. లేటెస్ట్ గా ఒక పక్కన సినిమాలు చేస్తూనే హీరో, హీరోయిన్ల డేట్లు, కొత్త వారి పరిచయం, అలాగే వారి బ్రాండింగ్ వంటివి చూసే క్వాన్ అనే సంస్థను స్టార్ట్ చేసారు. ముందు దాన్ని హైదరాబాద్ లో స్టార్ట్ చేసి, చెన్నయ్ కు విస్తరించారు. ఈ లెక్కన లేటెస్ట్ గా అప్పీ ఫిజ్ పానీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ను నియమించారు. రెండేళ్లపాటు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు. ఇందుకు గాను ఎన్టీఆర్ కు మూడు కోట్లకు పైగా మొత్తం పారితోషికంగా లభిస్తున్నట్లు …అయితే ఇందులో పదిశాతం రానా కంపెనీకి కమీషన్ గా వెళ్తుందట. ఈ లెక్కన పక్కా బిజినెస్ మెన్ అన్నమాట . రానా కు సంబందించిన ఈ సంస్థ ద్వారా ఆప్పీ ఫిజ్ యాడ్ వచ్చింది. అందుకే ఇలా ….. తాజాగా తెలుగు లో ఎన్టీఆర్ అప్పీ ఫిజ్ యాడ్ చేసాడు . బాలీవుడ్ లో సల్మాన్ చేయగా సౌత్ లో ఎన్టీఆర్ ఇది వారి లెక్క .