తెలంగాణ లో మరో దారుణం.. యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది

మన సమాజంలో రోజు రోజుకు ఏమైపోతుందో తెలియడం లేదు. మహిళలపై జరుగుతున్నా దాడులు రోజు రోజు కు పెరుగుతూ వున్నాయి. మహిళలపై దాడుల్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా, ప్రేమోన్మాదుల దారుణాలు ఆగడం లేదు. కాగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతాన్ని మరవక ముందే, తెలంగాణ రాష్ట్రంలో మరొక దారుణమైన ఘటన జరిగింది. కాగా తనని ప్రేమించమని గత కొంత కాలంగా ఒక యువతిని వేధిస్తున్నాడు ఆ ప్రేమోన్మాది. కానీ ఎంతకీ తనని ప్రేమించలేదనే కారణంతో ఆగ్రహించిన ఆ ప్రేమోన్మాది సదరు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

ఈ దారుణమైన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూరులో జరిగింది. కాగా తన ప్రేమని ఒప్పుకోలేదని అక్కసుతో ఆ యువతి పైన కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన లో అడ్డుకోబోయిన యువతి కుటుంబ సభ్యులపైనా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనకు తాను కాల్చుకున్నాడు. అయితే ఈ ఘటన తో స్పందించిన స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. తద్వారా ఆ ప్రేమోన్మాది ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.