ఆపరేషన్ జరుగుతున్నంత సేపు భర్తతో ఫోన్ మాట్లాడిన మహిళా….

ఈ విచిత్రం జైపూర్, రాజస్థాన్ లో జరిగింది. శాంతి దేవి అనే మహిళా కొన్ని రోజులనుంచి సరిగా మాట్లాడలేని స్థితిలో మరియు అస్వస్థతకు గురై జైపూర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చెక్ అప్ చేయుంచుకుంది.

అన్ని పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆ మహిళా తలలో ట్యూమర్ ఉన్నట్టు గుర్తించారు. మనం మాట్లాడేటప్పుడు స్పందించే మెదడు ప్రాంతంలో ఈ ట్యూమర్ ని గుర్తించారు అయితే మహిళకు అనస్తీసియా ఇచ్చి ఆపరేషన్ చెయ్యచ్చు కానీ అత్యంత ఖచ్చితత్వంతో కూడుకున్న ఆపరేషన్ కాబట్టి డాక్టర్లు ఓక నిర్ణయానికి వచ్చారు. ఆపరేషన్ సమయంలో మహిళా మాట్లాడుతుంటే మెదడు లో ఆ ప్రాంతంలో కదలికలను బట్టి ఆపరేషన్ చెయ్యటం సులభతరం అయ్యింది. ఈ ఆపరేషన్ కి ముందు రెండు రోజులు మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తక్కువ మోతాదులో అనస్తేషియా ఇవ్వటం వల్ల మహిళ మెలుకువగా ఉంది. ఆపరేషన్ సమయంలో మహిళ తన భర్తతో మాట్లాడటం విశేషం.