కామ్రేడ్లకు పవన్ ఇంత షాక్ ఇచ్చారేంటి ?

pawan kalyan ,Telugu Vilas
ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో కలిసి ముందుకు సాగుదామని కుతూహలంతో ఉన్న కామ్రేడ్లకు జనసేనాని పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. మంచి సిద్ధాంతాలు కలిగిన పార్టీ అనే పరున్నా ప్రజాదరణ లేకపోవటం తో కామ్రేడ్లు జనసేనతోకలిసి సాగి వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళాలని భావించారు.ఏపీలో ఈ పార్టీకి జనసేన రూపంలో పవన్ కళ్యాణ్ ఒక ఆశాకిరణంలా కనిపించాడు. పవన్ కు మొదటి నుండి కమ్యూనిస్ట్ భావజాలం ఉండటం వల్ల కూడా ఆయన పార్టీ తో కలిసి సాగాలనుకున్నారు కంయూనిస్తులు. అశేషాభిమానుల్ని కలిగి ఉన్న పవన్ తో కలిసి నడిస్తే పార్టీ భవిష్యత్తు బాగు పడుతుందని వామపక్ష నేతలు ఆశించారు.
Pawan-kalyan-With-Go-For-Communist-Parties,Telugu Vilas
ఇదే విషయాన్ని జనసేనానికి చెప్పి రాబోయే ఎన్నికల్లో కలిసి సాగాలనే ఆలోచన కూడా ఆయనకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దాం అనే తమ ఉద్దేశ్యాన్ని వ్యక్తపరిచారు. పార్టీ పెట్టిన మొదట్లో సానుకూలంగానే స్పందించిన పవన్ వారితో కలిసి ర్యాలీలు, మీటింగుల్లో పాల్గొన్న పవన్ ఆ తర్వాత కామ్రేడ్లను నిర్లక్ష్యం చేశారు. జనసేనాని కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి తెలుసుకున్నారు. ప్రజాదరణ లేదని తెలిసి కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వటం లేదు. అసలు కలుస్తారా కలవరా అనేది కూడ చెప్పకుండా కాలయాపన చేశారు. పవన్ తమని ఎంత దూరం పెడుతున్నా కమ్యూనిస్టుల్లో ఏమూలనో ఏమో పవన్ కు మనం ఉన్నపళంగా గుర్తొస్తామేమో అనే చిన్న ఆశతో ఉంటూ వచ్చారు.
janasena,Telugu Vilas
కానీ నిన్న అధికార, ప్రతిపక్షాలకు సంధానం చెబుతూ తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, తమకు ఎవరి సపోర్ట్ అవసరంలేదని పవన్ బల్లగుద్ది చెప్పేశాడు. దీంతో కమ్యూనిస్టులకు షాక్ తగిలినంత పని అయ్యింది. జనమే తన బలంగా ముందుకు సాగుతామని జనసేన ఏ పార్టీ తో పొత్తు పెట్టుకోదని పవన్ కళ్యాణ్ ఇచ్చిన షాక్ కు కమ్యూనిస్టులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు