చంద్రబాబు రాజకీయ ప్రయోజనం కోసమే నన్ను వాడుకున్నారు…!

Pawan Janasena, Telugu Vilas

Pawankalyan Shocking Comments On Chandrababu — చంద్రబాబు రాజకీయ ప్రయోజనం కోసమే నన్ను వాడుకున్నారు…!ఈ రోజు అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పై ధ్వజమెత్తారు.గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలను చిత్తశుద్ధితో నిర్వహించలేదని ఆరోపించారు.2014లో తిరుపతిలో జరిగిన సభలో ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ ఎన్నికల తర్వాత ప్రత్యేక ప్యాకేజీగా మారిపోయిందని విమర్శిచారు. తనను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారనీ.. ఓ రాజకీయ పార్టీగా పరిగణించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

PawanKalyan,

Also Read: — శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ బ్రేకింగ్స్……!

పూటపూటకు మాట మారిస్తే రాజకీయ చిత్తశుద్ధి ఎక్కడి నుంచి వస్తుందని పవన్ ప్రశ్నించారు.బీజేపీని తాను ఎప్పుడూ వెనకేసుకురాలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి నిజనిర్ధారణ కమిటీ(జేఎఫ్ఎఫ్ సీ)ని తాను మాత్రమే పెట్టలేదనీ, ఇందులో మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, పద్మనాభయ్య, కృష్ణారావులు భాగస్వాములుగా ఉన్నారని వెల్లడించారు.

pawan-kalyan-press-meet, Telugu Vilas

ఆంధ్రప్రదేశ్ కు రూ.70,000 కోట్ల మేర నిధులు ఇంకా రావాల్సి ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ప్రత్యేక హోదా అంటూ తాను ముందుకు పోతుంటే, ప్రత్యేక ప్యాకేజీ అంటూ చంద్రబాబు వెనక్కు లాగుతున్నారని పవన్ విమర్శించారు. ఈ విషయంలో మాట్లాడాల్సింది తెలుగుదేశం, వైసీపీ నేతలేనని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, హక్కుల కోసం జనసేన చివరివరకూ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Also Read: — జనసేనలోకి నాదేండ్ల మనోహర్ …!