టీడీపీని టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ … సంచలన ట్వీట్స్

pawankalyan-tdp targets

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రసవత్తర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్షం వైసీపీనా లేక జనసేన పార్టీనా అన్న స్థితిలోకి ఇక్కడి పరిస్థితులు చేరుకున్నాయి. మాటి మాటికీ ప్రశ్నిస్తానన్న నాయకుడు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు టార్గెట్ గా మాటల దాడికి దిగుతున్నారు. తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య యుద్ధం మాత్రం ఓ రేంజ్ లోనే జరుగుతుందని చెప్పాలి.
పవన్ తన ప్రజా పోరాట యాత్రలోనే తెలుగుదేశం నేతలకు ఊపిరి ఆడనంత స్థాయిలో విరుచుకుపడుతున్నారు .అలా అని తన యాత్ర కి బ్రేక్ ఇచ్చినా సరే వదులుతారా అంటే అది కూడా లేదు.సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా పెట్టుకొని ఎప్పటికప్పుడు సంచలనానికి దారి తీస్తున్నారు.

pawankalyan, telugu vilas

ఆ మధ్యనే శ్రీకాకుళంలో టీడీపీ చేసిన నిర్వాకం ఇది అంటూ,30 కుటుంబాలకు బాబు గారు 500 ఇచ్చారు అని, వ్యవసాయం చేసుకొని బ్రతికే రైతుల భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదు అని తెలుగుదేశం పార్టీకి కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ వద్ద రోడ్ పగుళ్ళపై ఈ మధ్య చేసినటువంటి ట్వీట్లకు అయితే లోకేష్ కి మరియు పవన్ కి ఒక మినీ యుద్ధమే జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీయే టార్గెట్ గా సంచలన ట్వీట్ చేశారు.”నీరు కలుషితం అయితే చేపలు శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడతాయి అదే విధంగా ప్రభుత్వం కఠినంగా మారితే ప్రజలు తిరగబడతారు” అని టీడీపీ ని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. ఇప్పుడు పవన్ తాజాగా చేసిన ట్వీట్ ఏపీలో రాజకీయ దుమారం రేపుతుంది.

Also Read : పవన్ షాక్ అయి ఉంటారా..?

                 సీఎం ఎవరో అప్పుడు చెప్తానన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్

                 కాంగ్రెస్ కు కొత్త చిక్కు …టీడీపీ పై రాములమ్మ అనుమానాలు