బాబు కొంప ముంచే బాలయ్య .. బాలయ్య చెప్పింది ఏపీలో నిజం చెయ్యమన్న రోజా

 

oja,balakrishna,politics,trendingnewsఏపీ టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా తెలంగాణ ఎన్నిక‌ల్లో భాగంగా ప్ర‌చారం చేస్తున్నారు .అంతేనా సంచలన వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ప్రచారంలో భాగంగా మాట్లాడిన బాలయ్య సైబరాబాద్ నగరాన్ని నిర్మించి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన చరిత్ర చంద్రబాబుదేనని బాలకృష్ణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిన ఆయన్ను, తెలంగాణ నుండి ఔటర్ చెయ్యాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వాళ్లు ఔట్ అండ్ ఔట్ కమెడీయన్లుగా మిగిలిపోతారంటూ విమర్శించారు. అయితే బాల‌య్య మాట‌లు ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నాయి కానీ, ఆ త‌ర్వాత ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు బాల‌య్య, మాట్లాడిన మాట‌లు టీడీపీ కొంప‌ముంచేలా ఉన్నాయి. అవి ఫైర్ బ్రాండ్ రోజాకు బాగా దొరికాయి. దీంతో ఆమె బాలయ్యను చెడుగుడు ఆడుకుంది.
టీడీపీ నుండి గెలిచి పార్టీ మారిన వారిని ఓడించాల‌ని, వారికి జ‌నం బుద్ది చెప్పాల‌ని బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో క‌ల‌క‌లం రేపాయి. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ‌లో ప్ర‌త్య‌ర్ధిపార్టీను టీఆర్ఎస్ త‌న పార్టీలో చేర్చుకుంది. అలాగే ఏపీలో కూడా వైసీపీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకుంది. మ‌రి అలాంట‌ప్పుడు తెలంగాణ‌లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను ఓడించాల‌ని పిలుపు నిచ్చిన బాల‌య్య‌, ఏపీలో టీడీపీ చేసిందేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో చేతికి మైక్ దొరికితే ఏం మాట్లాడ‌తాడో కూడా తెలియ‌ని బాల‌య్య చేసిన తాజా వ్యాఖ్య‌లు, ఏపీలో ఫిరాయించి టీడీపీలో చేరిన నేత‌ల‌తో పాటు, చంద్ర‌బాబు కొంప‌ముంచేలా ఉన్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.
ఇక ఈ విషయంలో రోజా బాలయ్యను ఆడుకున్నారు .సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీకి రారు, హిందూపూరంకి వెళ్లరు కానీ తెలంగాణాలో ప్రచారానికి మాత్రం వెళ్తున్నారని విమర్శించారు. మీబావ వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు, వారిని మంత్రుల్ని చేసినపుడు లేవని నోరు ఇప్పుడెలా లేస్తుందని ప్రశ్నించారు. అక్కడ పార్టీ ఫిరాయించిన వాళ్ళను ఓడిస్తే ఇక్కడ కూడా మీ పార్టీ లో చేరిన వైసీపీ నుండి గెలిచిన 23 మందిని ఓడించాల్సిందేగా అని ప్రశ్నించారు. బాలయ్య చెప్పిందే చెయ్యమని చెప్పుకొచ్చారు. టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే మీ నందమూరి కుటుంబం పౌరుషం ఏమైందని రోజా బాలయ్యను నిలదీశారు. నందమూరి సుహాసినిని కూడా కరివేపాకులా వాడుకుంటున్నారని, ఓడిపోయే స్థానం కట్టబెట్టి ఆమెని బలిపశువుని చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు.హరికృష్ణని మానసికంగా చంపేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. హరికృష్ణ కుటుంబంపై ప్రేమ ఉంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ లేదా కళ్యాణ్‌ రామ్‌లలో లోకేష్‌ మాదిరిగా డైరెక్ట్‌గా ఎమ్మెల్సీ కేటాయించి మంత్రిని చేసినట్లు చెయ్యొచ్చుగా అంటూ ప్రశ్నించారు. నందమూరి కుటుంబం ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవుపలికారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను వదిలేస్తే ఇప్పుడు మీ నెత్తికెక్కి కూర్చున్నాడు అని కేసీఆర్‌ కు గుర్తు చేశారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి తెలంగాణా నుండి తరిమికొట్టాలని ప్రజలకు రోజా విజ్ఞప్తి చేశారు.