SAAHO మూవీ టీజర్ కి పోటీగా అదే రోజు కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు 2 టీజర్ విడుదల

prabhas saahoo teaser

SAAHO మూవీ టీజర్ కి పోటీగా అదే రోజు కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు 2 టీజర్ విడుదల

prabhas saahoo teaser

బాహుబలి 2 తరువాత ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో ఈ సినిమా మీద ప్రభాస్ ఫాన్స్ కి బారీ అంచనాలే ఉన్నాయి అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ టీజర్ జూన్ 13 అంటే రేపు విడుదల కానుంది మరియు ప్రేక్షకులు ఇంతగా ఎదురు చూస్తున్న ఈ మూవీ టీజర్ కి ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తాయో ఎన్ని ఆన్లైన్ రికార్డ్స్ బద్దలవుతాయో ఊహకి అందడం లేదు

ఇదిలా ఉండగా కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు మూవీ కి సీక్వెల్ గా వస్తున్న మన్మధుడు 2 టీజర్ కూడా సాహూ టీజర్ కి పోటీగా జూన్ 13 అంటే రేపే విడుదల చేస్తాం అని ప్రకటించడం మీడియా వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది

ఇప్పటి దాకా మన్మధుడు 2 మూవీ టీం వర్కింగ్ స్టిల్స్ మాత్రమే వదులుతూ వచ్చారు తప్ప కనీసం ఒక పోస్టర్ కూడా విడుదల చెయ్యలేదు అలాంటిది ఇప్పుడు ఒకేసారి టీజర్ అంటే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అనే డౌట్ వస్తుంది ఇక రేపటి నుంచి ప్రతి ఒక్కరు సాహూ మేనియా లో ఉంటారు కాబట్టి మన్మధుడు 2 టీజర్ కూడా వ్యూస్ తెచ్చుకుంటుంది అని కొంత మంది అంటుండగా మరి కొందరు మాత్రం సాహూ కి పోటీగా వ్యూస్ కష్టమే అంటున్నారు

ఆగష్టు 9 న మన్మధుడు 2 మూవీ ని విడుదల చెయ్యడానికి నాగ్ సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది వారం కన్నా తక్కువ గ్యాప్ లోనే సాహూ మూవీ కూడా విడుదల కానుంది అయినా కూడా లెక్క చెయ్యకుండా తన సినిమా మీద నమ్మకంతో అదే డేట్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది

సాహూ మీద ఎంత క్రేజ్ ఉన్నా ఆ మూవీ వలన తనకొచ్చిన ఇబ్బందేమీ లేనట్టు నాగ్ వ్యవహరిస్తున్నాడు దీని మీద ఇంకా కొద్ది రోజులు ఆగితే మనకి కొంచెం క్లారిటీ రావచ్చు ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే రేపు టీజర్ వదలడం న్యాయమే కానీ సరిగ్గా సాహూ వచ్చే రోజునే విడుదల చేయడం మాత్రం కొన్ని అనుమానాలు రేపుతోంది

అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీద్రన్ దర్శకత్వం వహించిన మన్మధుడు 2 లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాగా సమంతా కీర్తి సురేష్ స్పెషల్ క్యామియోలు చేస్తున్నారు

 

prabhas saahoo teaser

Vijay Devara Konda New Movie