పురంధరేశ్వరి షాకింగ్ కామెంట్ … అంతా చేసింది చంద్రబాబే

Purandareswari Shocking Comments on Chandrababu, Telugu vilas

ఎన్టీఆర్ తనయ చంద్రబాబు అంటే ఒంటి కాలి మీద లేచే దగ్గుపాటి పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో ఆమె చేసిన వ్యాఖ్యలు టీడీపీ కి తలనొప్పిగా మారాయి. ఏపీ కి ఈ దుస్థితికి చంద్రబాబే కారణం అని పురంధరేశ్వరి మండి పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు అక్కడ తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుందో అందరికి తెలుసు. అయితే ప్రత్యేక హోదాకోసం టీడీపీ ఎంపీలు కూడా ఆందోళనలు చేస్తుంటే ఇక ఈ సమస్య కు కారణం చంద్రబాబు అని పురంధరేశ్వరి చెప్తోంది. అయితే అసలు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి గల మూల కారణం బాబు గారే అని బీజేపీ నేత పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేసారు.

Image result for Purandeswari imagesఇక బీజేపీ తో సఖ్యంగా ఉన్న రోజుల్లో ఆయన కూడా రోజుకో రకంగా ప్రజలను మభ్యపెట్టారు. ఇక ప్రజలు నమ్మేలా లేరు అని భావించి బీజేపీ తో స్నేహబంధాన్ని తెంచుకున్నారు.ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబే మాటలు మారుస్తూ వచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇవ్వడం కుదరదు,ప్యాకేజీ మాత్రమే ఇవ్వగలం అని పార్లమెంటులో చెప్పినపుడు అదంతా బాబు గారికి ముందే తెలుసు. ఇక అరుణ్ జైట్లీ పక్కన కూర్చొని ఫుల్ స్టాప్లు,కామాలు ఎక్కడెక్కడ పెట్టాలో చెప్పిన వ్యక్తి చంద్రబాబు ఇదంతా జరిగింది ఆయన వల్లే ఏపీ కి ఈ గతి పట్టింది ఆయన వల్లే అని సంచలన వ్యాఖ్యలు చేసారు.మొత్తం చంద్రబాబు చేసి ఇప్పుడు నిందను బీజేపీపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు.