‘మీటూ’ పై ‘ఘాటైన’ వ్యాఖ్య చేసిన .. రాయ్ లక్ష్మీ

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పాకిన ఉద్యమం “మీటూ ఉద్యమం“. చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం. మొదట్లో మంచి ఊపులో, అందరి మద్దతు కూడా కట్టుకున్న..ఆ తరువాత రానురాను ఈ ఉద్యమం నీరు గారి పోయిందనే చెప్పాలి. తాజాగా ఈ విషయంలో స్పందించిన నటి రాయ్ లక్ష్మీ మాట్లాడుతూ…. మీటూ ఉద్యమం పనైపోయిందని, దాని గురించి మాట్లాడనని అంటోంది . ముగిసిపోయిన వ్యవహారం గురించి మాట్లాడుకోవడం వృధా అని చెబుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకి కాస్టింగ్ కౌచ్, మీటూ వంటి వ్యవహారాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీటూ ఉద్యమం ముగిసిపోయిందని, ఏదో జరుగుతుందని సంబరపడ్డాను కానీ ఏదీ జరగలేదని అన్నారు. కొంతమంది అమ్మాయిలు నిజాయితీగా బయటకొచ్చినా.. వారికీ సరైన న్యాయం దొరకలేదని,మొత్తంగా చూస్తే ఈ ఉద్యమం పక్కదారి పట్టిందని,పోను పోను ఈ ఉద్యమం వ్యక్తిగత కక్షలకు దారితీశాయని రాయ్ లక్ష్మీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం నడుస్తున్న మీటూ ఉద్యమానికి తను ఎలాంటి సపోర్ట్ ఇవ్వనని ప్రకటించింది రాయ్ లక్ష్మీ. అసలు నిజమేంటో తెలియనప్పుడు మద్దతు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. మరిన్ని విషయాలను చెబుతూ.. ”నాకు బ్రేక్ ఇవ్వకపోతే నీ గురించి చెడుగా మాట్లాడతా అనేంతవరకు వెళ్లిపోయిందని. అవకాశాల కోసం ఇలా బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని,అందుకే ఈ ఉద్యమాన్ని నేను సపోర్ట్ చేయాలనుకోవడం లేదు. సౌత్ కి సంబంధించినంత వరకు నేను కొన్ని మీటూ స్టోరీలు విన్నాను.. అవి అబద్దాలని నేను చెప్పను …అలా అని నిజాలు కూడా కావు” అంటూ చెప్పుకొచ్చింది.